కోర్ట్ వార్తలు ...

సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!!

  • మానసిక వేదనకు గురయ్యానంటూ వృద్ధురాలు పరువునష్టం కేసు
  • సుదీర్ఘకాలంగా కొనసాగుతోందంటూ న్యాయమూర్తి అసహనం
  • మరుసటి రోజే 2026 జులై 15వ తేదీకి వాయిదా వేసిన కోర్టు

ఒక పరువునష్టం కేసులో 90 ఏళ్ల వృద్ధురాలు మొండిపట్టుదలతో ఉండటంతో, తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి, కేసును 2046 ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత ఉత్తర్వులను మార్చారు. సులభంగా పరిష్కారమయ్యే ఈ కేసు సుదీర్ఘకాలంగా కొనసాగుతోందని, ఇలాంటి కేసులు న్యాయవ్యవస్థకు అదనపు భారంగా మారుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు 2015లో ప్రారంభమైంది.

పదకొండేళ్ల క్రితం శ్యామ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో వార్షిక సమావేశం జరిగింది. అక్కడ జరిగిన కొన్ని ఘటనలతో తాను మానసిక వేదనకు గురైనట్టు పేర్కొంటూ 90 ఏళ్ల తరిణిబెన్… పలువురిపై 2017లో రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఏప్రిల్ 20న జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్షాలు రాజీకి యత్నించాలని బాంబే హైకోర్టు సూచించింది. ప్రతివాదులు బేషరతుగా క్షమాపణ చెప్పడానికి అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు అంగీకరించలేదు. దీనితో కేసు ఎటూ తెగడం లేదు.

బాంబే హైకోర్టులో మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ కేసుపై న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర జైన్ అసహనం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరు ఇది అని, వ్యవస్థను జామ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల వల్ల అత్యంత ప్రాధాన్యత ఉన్న కేసులను న్యాయస్థానం చేపట్టలేకపోతోందని అన్నారు. ఈ కేసు వేసింది సూపర్ సీనియర్ సిటిజన్ అయినంత మాత్రాన ప్రాధాన్యం ఇవ్వలేమని అన్నారు. 2046లో కేసు విచారణ చేపడతామని పేర్కొన్నారు. అయితే, బుధవారం తన ఆదేశాలను మార్పు చేశారు. 2026 జులై 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Related posts

కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు … కోర్టును సమయం కోరిన తీన్మార్ మల్లన్న!

Ram Narayana

మంత్రి కొండా సురేఖపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీకి నాంపల్లి కోర్టు ఆదేశాలు

Ram Narayana

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి 14ఏళ్లకు న్యాయం..1.99 కోట్ల పరిహారం అందజేత…

Ram Narayana