Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు …కూలీలందరికి కూలీ బందు ప్రవేశ పెట్టాలి!

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లుకూలీలందరికి కూ బందు ప్రవేశ పెట్టాలి
సిపిఎం ఆధ్వరంలో ధర్నా కలెక్టరేట్ ముట్టడి .అరెస్టులు ,ఉద్రక్తమ్
సిపిఎం జిల్లా కార్యదర్శి తోసహా పలువురి అరెస్ట్ ,వన్ టౌన్ కు తరలింపు
రైతు రుణమాఫీ అమలు జరగలేదురైతు బందు సైతం సరిగ్గా అమలు జరగటం లేదు
కొత్త పాస్ పుస్తకాలు అందటంలేదు

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని , కూలీలందరికి కూలి బందు పథకం అమలు చేయాలనీ కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్ లో ధర్నా అనంతరం ,కలెక్టరేట్ ముట్టడించే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.కార్యకర్తలు పెద్ద ఎత్తున రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ లోనికి చొచ్చుకొని పోయే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర్ రావు , యర్రా శ్రీకాంత్ , వై .విక్రమ్ , యర్రా శ్రీనివాస్ రావు తో సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అంతకు ముందు ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో నున్న నాగేశ్వర రావు మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాట తప్పారని ,ఆయన పాలనా 7 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి గా నిలిచి పోయారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి , దళిత ముఖ్యమంత్రి , మాటలకూ మోసపోయిన హరిజనులకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని అంటున్నారని ఇది కేవలం హుజురాబాద్ ఎన్నికలకోసమేనని దుయ్యబట్టారు . దళితులకు 10 ఇస్తానంటే ఎవరు వ్యతిరేకించారని ,అయితే ఈ పథకం కూలీలందరికి వర్తింప చేయాలనీ సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు.ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలేదు . రైతులకు రుణమాఫీ చేయలేదని ,రైతు బందు,రైతు బీమా సక్రమంగా అమలు జరపటంలేదని , కొత్త పాస్ పుస్తకాలు నెలల తరబడి ఇవ్వడంలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి మోసపు మాటలతో గద్దెనెక్కిన కేసీఆర్ కు పాలిచ్చే అర్హత లేదని అన్నారు . ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , కూలి బందు , రైతుల సమస్యలపై స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

Related posts

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

చంద్రబాబు పవన్ భేటీ …జగన్ సర్కారుపై సమరశంఖం..

Drukpadam

భట్టి పాదయాత్ర జయప్రదం కావాలన్న సోనియా ,రాహుల్!

Drukpadam

Leave a Comment