Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!
మృతదేహం అంబులెన్సుపై చెప్పులు
సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
రైలు పట్టాలపై శవమై తేలిన నిందితుడు రాజు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహం తరలింపు
కాసేపట్లో పోస్టుమార్టం
భాదిత కుటుంబానికి 20 లక్షల చెక్కు …డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

హైదరాబాద్ సైదాపూర్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారం చేసి , హత్య చేసిన దుండగుడు రాజు ఖాజిపేట సమీపంలో స్టేషన్ ఘనపూర్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారిని పొట్టన పెట్టుకున్న దుండగుడిని ఎన్కౌంటర్ చేయాలని , ప్రజల మధ్యలో ఉరితీయాలని , వాడికి తగిన శాస్తి జరగాలని ప్రజలు కోరుకున్నారు .అనేక రాజకీయపార్టీల నేతలు చిన్నారి ఇంటిని సందర్శించి జరిగిన ఘటనపై వాకబు చేశారు. ఒకరేమిటి సమాజంలోని వివిధరంగాలకు చెందిన వారు చివరికి సినీ రంగంలోని ప్రముఖ హీరోలు సైతం జరిగిన సంఘనతపై స్పందించారు. పోలీసులు రాజుకు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారు జామున రాజు శవం స్టేషన్ ఘనపూర్ దగ్గర రైలు పట్టాలపై పడి ఉండటాన్ని గుర్తించారు. రాజు చేతిపై మోనికా అనే పచ్చబొట్టు ఉండటంతో గుర్తింపు తేలిక అయింది. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎం జి ఎం కు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు శవాన్ని తీసుకోని వస్తున్నా అంబులెన్స్ పై రాళ్లతో దాడి చేశారు.

హైద్రాబాద్ లోని సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ ని సైతం స్థానికులు అడ్డగించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రభుత్వం తరుపున 20 లక్షల చెక్కును చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని కూడా హోమ్ మంత్రి తెలిపారు.

స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై పడివున్న అత్యాచార ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రైల్వే సీఐ రామ్మూర్తి నేతృత్వంలో పోలీసులు రాజు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాజు మృతదేహం ఉన్న అంబులెన్స్ పై చెప్పులు విసిరారు. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన రాజు చనిపోయినా, ప్రజల్లో అతడిపై నెలకొన్న తీవ్ర ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదనడానికి చెప్పులు విసిరిన ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి విపరీతమైన ఆవేశంతో చెప్పు తీసుకుని అంబులెన్స్ ను కొడుతుండడం వీడియోలో కనిపించింది. పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. రాజు కుటుంబ సభ్యులు వస్తే పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనిపై రాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అది రాజు మృతదేహం అని గుర్తిస్తేనే పోస్టుమార్టం ప్రక్రియ షురూ అవుతుంది.

Related posts

వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. హైదరాబాద్ లో దారుణం..!

Drukpadam

ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు…

Ram Narayana

సంచలనం …వైసీపీ నేత పై జిల్లా బహిష్కరణ వేటు!

Drukpadam

Leave a Comment