Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల యాత్రల వాయిదా వెనక ఆంతర్యం ఏమిటి

షర్మిల యాత్రల వాయిదా వెనక ఆంతర్యం ఏమిటి
-నిజంగా ఎన్నికలే కారణమా ?
– లేక అన్న రాయబారం ఫలించిందా ?
-ముఖ్యనేతలు లేరని మనసు మార్చుకుంటున్నారా ?
-అసలు షర్మిల మనసులో ఏమిఉంది ?
షర్మిల ఈ నెల 21 ఖమ్మం లో జరప తలపెట్టిన పర్యటన వాయిదా వెనక ఆంతర్యం ఏమిటి ? ఏమైనా ఉందా…. అంతో ఆర్బాటంగా బెంగుళూర్ నుంచి హైద్రాబాద్ వచ్చిన షర్మిల ఎందుకు పర్యటన వాయిదా వేసుకున్నారు. నిజంగానే తెలంగాణలో జరుగుతున్నా పట్టభద్రుల ఎన్నికే కారణమా ? లేక అన్న కోరికమేరకు పార్టీ నిర్ణయం పై పునరాలోచనలో పడ్డారా ? అన్న రాయబారం ఫలించిందా ? లేక ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎవరు తనతో కలిసి రావటం లేదని భావించారా ? అసలు షర్మిల మునుసులో ఏముంది. ? ఇంతకూ తెలంగాణాలో పార్టీ పెడతారా ? లేక వెనక్కు తగ్గుతారా? నిజంగా తెలంగాణాలో షర్మిల పార్టీ అవసరం ఉందా ? వైయస్ అభిమానులంతా వివిధ పార్టీలో ఉన్నారు . ఇప్పుడు వారంతా షర్మిల కు అండదండగా ఉంటారా? అసలు ఆమె నిర్ణయం స్వంతగా తీసుకున్నదా? లేక ఎవరైనా ఉన్నారా? అనేదానిపై ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే . తెలంగాణాలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు తాను నడుం బిగించానని అందుకు రాజన్న బిడ్డగా మీరు చెప్పే మాటలు వినేందుకు వచ్చానని షర్మిల మొదటి రోజు నల్లగొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఇక నుంచి తాను అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడతానని అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటానని సెలవిచ్చారు. వైయస్ అభిమానులకు షర్మిల మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. జై షర్మిల , జై వైయస్ఆర్ అన్నారు. షర్మిల మీటింగ్ పెట్టిన మొదటి రోజునే ఆంధ్రా హెడ్ ఆఫీస్ నుంచి ఆ పార్టీకి చెందిన జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ఒక ప్రెస్ పెట్టి షర్మిల పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టె ఉద్దేశం ఉందని తెలిసిన వెంటనే తెలంగాణాలో పార్టీ పెట్టవద్దని వారించమని అన్నారు. అనంతరం పరిణామాలలో ఆమె తన దారి తనదేనంటూ ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. దీనితో ఆమె పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశం షర్మిలతోను, బ్రదర్ అనిల్ కుమార్ తో జరిగింది. ఇంతవరకు వారు ఏమిమాట్లాడుకున్నారనేది బయటకు రానప్పటికీ జగన్ స్వయంగా రామకృష్ణ రెడ్డి ని తన తరుపున రాయబారం పంపించారని ప్రచారం జరిగింది. ఆయన చివర సారిగా చెల్లలుకు పార్టీ విషయంలో ఆలోచించుకోమని వర్తమానం పంపినట్లు తెలుస్తుంది . దీనిపైనా ఆమె ఆలోచనలో పడ్డారా ? తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ మనుగడపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పార్టీ పెట్టిన విజయశాంతి , టైగర్ నరేంద్ర , దేవేందర్ గౌడ్ , తదితరులు పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసి పోయాయి . తెలంగాణకు వ్యతిరేకమైన వైయస్ కుటుంబం ను ఇక్కడ ప్రజలు ఆదరించరని వైయస్ కుటుంబంతో దగ్గర సంబంధం ఉన్న గొనె ప్రకాశరావు అన్నారు.

Related posts

ఖమ్మం సభలో బీజేపీ పై నిప్పులు చెరిగిన కేరళ సీఎం పినారై విజయన్!

Drukpadam

2024 ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ..! : కమల్ నాథ్

Drukpadam

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

Drukpadam

Leave a Comment