రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను పవన్ కళ్యాణ్ మిస్ లీడ్ చేశాడా ?
-ఏపీ ప్రభుత్వంపై తన వ్యక్తి గత కక్షను తీర్చుకునేందుకు వేదికను దుర్వినియోగం చేశారా ??
-ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో దాన్ని కెలికి కంపు చేశారా ???
-పవన్ కళ్యాణ్ రాజకీయదుమారం పై …సినీ ఇండస్ట్రీ లో భిన్న స్వరాలు
-‘పావలా.. సన్నాసి’ అంటూ వెల్లంపల్లి వ్యాఖ్యలు…
-ఒక్క సీటు కూడా గెలవలేదని విమర్శలు
-చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని వ్యాఖ్య
-బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి పవన్ అంటూ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ కం రాజకీయనాయకుడు జనసేన అధినేత…. ఏపీ రాజకీయాలు నడుపుతున్నాడు … జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ఎదో ఒక కార్యక్రం చేపట్టడం , లేదా మీడియా లో విమర్శలు గుప్పించడం జరుగుతుంది. .. రాజకీయనాయకుడు అయినందున ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంలో ఎలాంటి తప్పు పెట్టాల్సిన పని లేదు. అది ఆయన భాద్యత కూడా … హైద్రాబాద్ లో జరిగిన ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అథిదిగా వెళ్లారు. …… అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. …కాని ఆ వేదిక మీద నుంచి దొరికిందే ఛాన్స్ అనుకుని ఏపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్ పైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమర్థనీయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా గురించి మాట్లాడు తప్పులేదు . ఇండ్రస్ట్రీ ఇబ్బందులో ఉంది అని చెప్పు వారిని ఆదుకోవాలని విజ్నప్తి చేసే కూడా ఎవరు తప్పు పట్టరు. కాని గుడ్డి వ్యతిరేకతతో వేదిక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు కూడా పవన్ మాట్లాడుతున్న తీరుకు నివ్వెరపోయారు. నాలుగు రోజుల క్రితం చిరంజీవి లవ్ స్టోరీ సినిమా ఫ్రీ రిలీజు ఫంక్షన్ లో కూడా సినీ ఇండస్ట్రీ భాదల గురించి చెబుతూ ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎం లకు విజ్నప్తి చేశారు. పవన్ చెప్పిన తీరుకు చిరంజీవి చెప్పిన తీరుకు పోల్చుకొని పలువురు సినీ ప్రముఖులు పవన్ మాటలను తప్పు పడుతున్నారు.
పవన్ పావలా సన్నాసి అంటూ మంత్రి వెల్లంపల్లి ధ్వజం ….
‘పావలా.. సన్నాసి’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ సర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ‘సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లంపల్లి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల తరఫున డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. జనసేన పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేదని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేక పోయాడని ఆయన అన్నారు.
ఏపీలో పవన్ కల్యాణ్‌కు చోటు లేదని తెలిసిపోయిందని ఆయన చెప్పారు. అసలు అన్నయ్య చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ లో కూర్చుని పేకాట ఆడడానికి తప్ప దేనికీ పనికి రాడని ఆయన అన్నారు.
తమపై పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి పవన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటని ఆయన నిలదీశారు.
సంపూర్ణేశ్ బాబు అయినా… పవన్ కల్యాణ్ అయినా ఒక్కటే!: ఏపీ మంత్రి అనిల్ కౌంటర్
- -సినిమాల్లో వారిద్దరిలో ఎవరూ నటించినా కష్టం అనేది ఒకటే
- -సినిమా టికెట్లు ఆన్‌లైన్ లో అమ్మితే తప్పేంటి?
- -వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్ వ్యాఖ్యలు
- -రాజకీయ ఉనికి కోసం ముఖ్యమంత్రి జగన్ ను తిడుతున్నారు
సినిమా టికెట్లు ఆన్‌లైన్ లో అమ్మితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… తమకు సంపూర్ణేశ్ బాబు అయినా… పవన్ కల్యాణ్ అయినా ఒక్కటేనని చెప్పారు. సినిమాల్లో వారిద్దరిలో ఎవరూ నటించినా కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్ వ్యాఖ్యలు చేశారని, ఎంత ట్రోలింగ్ చేసుకుంటారో చేసుకోండని ఆయన అన్నారు.
రాజకీయ ఉనికి కోసం ముఖ్యమంత్రి జగన్ ను తిట్టడం పవన్ కల్యాణ్ కు ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి అనిల్ అన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల పోర్టల్ గురించి సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని ఆయన చెప్పారు. తాము పారదర్శకత కోసమే ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలను తీసుకొస్తున్నామని తెలిపారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని, ఇది సరికాదని ఆయన అన్నారు. పవన్ ఒక్కడి కోసమే సినీ పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన అనడం సరికాదని మంత్రి అనిల్ చెప్పారు.
వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్ కు ఎందుకు?: మంత్రి బొత్స మండిపాటు
- -సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచుతున్నారు
- -ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు
- -సినీ పరిశ్రమలో ఉన్నది పవన్ కల్యాణ్ ఒక్కడే కాదు
- -చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించవచ్చు
సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ రోజు బొత్స విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ…. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచి, ప్రజలపై భారం వేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు.
సినిమా టికెట్ల ధరల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. జీఎస్టీలాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే సర్కారు ఉద్దేశమని తెలిపారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లే అడిగారని చెప్పారు.
అసలు వాళ్లకి లేని బాధ పవన్ కల్యాణ్‌కు ఎందుకని బొత్స నిలదీశారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఉన్నది పవన్ కల్యాణ్ ఒక్కడే కాదని, చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించవచ్చని చెప్పారు. కాగా, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.