అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలి.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే.
సి పి ఐ ఆధ్వర్యంలో ది ష్టిబొమ్మ దగ్ధం ప్రజాపక్షం/ ఖమ్యం బ్యూరో: రైతుల మృతికి కారకులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్మశ్రాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. లిఖింపూర్‌లో ఆందోళన చేస్తున్న రైతుల పై నుంచి వాహనాన్ని నడిపి ఇద్దరు రైతులు సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన అజయమిశ్రా కుమారుడు ఆశీఎమిశ్రాను కఠినంగా శిక్షించాలన్నారు. అజయ్మశ్రా విషయంలో కేంద్ర ప్రభుత్వ తాత్పర్య వైఖరిని నిరసిస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేవి బైపాస్ రోడ్డులో బస్టాండ్‌కు ఎదురుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనకారులను ఉద్దేశించి బాగం హేమంతరావు మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల రైకు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని రైతులు అడ్డుకుంటున్నారన్న నేపంతో రైతులపై దాడులు జరుగుతున్నాయని అదే క్రమంలో లిఖింపూర్ భేరిలో రైతులను తొక్కి చంపేందుకు ప్రయత్నం జరిగిందన్నారు. ఇద్దరు రైతుల మృతికి కారకుడైన కేంద్ర మంత్రిని మోడీ సమర్పించడం దురదృష్టకరమన్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టారని రైకు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే మోడీ భరతం పట్టడం ఖాయమని హేమంతరావు హెచ్చరించారు. అజయ్మశ్రాను బర్తరఫ్ చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలిపాడు. దేశాన్ని అమ్ముకునేందుకు మోడీ ప్రధాని పదవి చేపట్టినట్లు హేమంతరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ము ఉజేందర్రెడ్డి, శింగు నర్సింహారావు, నగర సిపిఐ కార్యదర్శి ఎస్కి జానీమియా, మహ్మద్ సలాం, పోటు కళావతి, జిల్లా సమితి సభ్యులు మేకల శ్రీ శ్రీనివాసరావు, తాటి విద్యల, గాదె లక్ష్మి నారాయలు, యాచాలి సాంబశివరెడ్డి, ముందా వెంకటేశ్వర్లు, పగిడిపల్లి ఏసు, బోదా వీరన్న, చింతా నూలిబాబు, సైదా, పొద్దుగూరు, వెంకటరెడ్డి, ఏఐఎన్ఎస్ కార్యడు ఇటీకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.