- జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో మోహన్ బాబు ఇల్లు
- ఇంటి ముందు యాడ్ బోర్డు ఏర్పాటు
- అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేశారన్న అధికారులు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు ఒక అడ్వర్టైజ్ మెంట్ బోర్డు ఉంది. అయితే జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ బోర్డును ఏర్పాటు చేశారని అధికారులు చర్యలు తీసుకున్నారు. లక్ష రూపాయల జరిమానా విధించారు. దీనికి సంబంధించి నోటీసులు అందించారు. దీనిపై మోహన్ బాబు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు.