.రాజకుటుంబ బాధ్యతలకు దూరంగా ఉండాలని గతేడాదే నిర్ణయం
- యవరాజు దంపతుల నిర్ణయంపై రాజకుటుంబం ఆవేదన
- వారి సైనిక గౌరవాలు, హోదాలు, బిరుదులను మరొకరికి పంచనున్న రాణి ఎలిజబెత్
బ్రిటన్ యువరాజు హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులు రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై స్వతంత్రంగా జీవించాలని గతేడాదే నిర్ణయించుకున్న యువ దంపతులు అందుకు కట్టుబడి ఉండడంతో వారి హోదాలు, బిరుదులను, సైనిక గౌరవాలను తొలగించనున్నారు. ప్రస్తుతం వారికి ఉన్న హిజ్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్ (హెచ్ఆర్‌హెచ్) బిరుదులు, డ్యూక్ ఆఫ్ ససెక్స్, డచెస్ ఆఫ్ ససెక్స్ వంటి హోదాలు తదితర వాటిని కోల్పోతారు. వాటిని రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు క్వీన్ ఎలిజబెత్-2 పంచుతారని బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది. యువరాజు దంపతులు తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకుటుంబం మొత్తం బాధపడుతున్నట్టు ప్యాలెస్ తెలిపింది.