Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదు అయ్యే అవకాశం …మానవ హక్కుల విభాగం నివేదిక!

ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదు అయ్యే అవకాశం …మానవ హక్కుల విభాగం నివేదిక!
-ఆ నివేదికను మేం గుర్తించడంలేదు… ఐక్యరాజ్యసమితిపై ధ్వజమెత్తిన ఉత్తర కొరియా
-ఉత్తర కొరియా పరిస్థితిపై మానవ హక్కుల విభాగం నివేదిక
-ఆకలి చావులు నమోదయ్యే ముప్పు ఉందని వెల్లడి
-ఆంక్షలు సడలించి సాయం అందించాలని సిఫారసు
-క్షేత్రస్థాయి పరిస్థితులను వక్రీకరించారని కొరియా ఆగ్రహం

ఉత్తర కొరియా లో ఆకలి చెవులు నమోదు అయ్యే అవకాశం ఉందని …కరోనా నేపథ్యం లో దేశం లో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని అంతర్జాతీయంగా ఆదేశంపై ఉన్న ఆంక్షలు సడలించి సహాయం అందించాలని ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ప్రత్యేక ప్రతినిధి థామస్ ఓజియో క్వింటానా ఉత్తరకొరియాకు సంబంధించి ఓ నివేదికను రూపొందించారు. దేశంలో లాక్ డౌన్ తో జనజీవనం దయనీయంగా మారిందని, అంతర్జాతీయ ఆంక్షలు సడలించి ఉత్తర కొరియాకు సాయం అందించాలని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదవడం ఖాయమని నివేదికలో పేర్కొన్నారు.

అయితే ఆ నివేదిక అంతా తప్పులతడక అంటూ ఉత్తర కొరియా అధినాయకత్వం మండిపడింది. ఆ నివేదికను తాము గుర్తించడంలేదంటూ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఉత్తర కొరియా పరిస్థితులను క్వింటానా వక్రీకరించారని, ఉత్తర కొరియాలో మానవ హక్కులు, స్థానిక స్థితిగతులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయనడంలో నిజం లేదని తెలిపింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనడం గర్హనీయమని స్పష్టం చేసింది.

అసలు, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమకు ఆమోదయోగ్యం కాదని, ఇదంతా అమెరికా ప్రోద్బలిత కార్యక్రమాల్లో భాగమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. తమకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం రూపొందించిన నివేదిక ఎంత మంత్రం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది. అమెరికా చెప్పినట్లు ఆడటం మానుకోవాలని ఐక్యరాజ్య సమితికి హితవు పలికింది.

Related posts

బద్వేల్ లో పోటీకిసై అంటున్న బీజేపీ ….

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

Drukpadam

కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సంపత్ ఫైర్!

Drukpadam

Leave a Comment