Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీలో ఎవరు కోటీశ్వరుడు కోటి రూపాయల ప్రశ్న కు జవాబు చెప్పిన కొత్తగూడెం వాసి !

ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న భద్రాద్రి కొత్తగూడెం ఎస్సై!
ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో
కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి ఫిక్స్ చేయమన్న రాజారవీంద్ర
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో
రేపు ప్రసారం కానున్న షో

ఎన్టీర్ నిర్వహిస్తున్న షో మీలో ఎవరు కోటీశ్వరుడు …సహజంగానే దానికి మంచి ఆదరణ ఉంది. అయితే షో కు వచ్చే వాళ్లలో ఎవరు కోటి రూపాయలు సొంతం చేసుకొంటారు అని అందరు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం రానే వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రాజా రవీంద్ర ఈ షో లో పాల్గొన్నాయి కోటి రూపాయలు గెలుచుకొన్నట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజా రవీంద్ర పాల్గొన్న షో రేపు ప్రసారం కానున్నది. దానికి సంబందించిన ప్రోమో ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో కోటి రూపాయలకు సంబందించిన 15 వ ప్రశ్న జానియర్ ఎన్టీఆర్ అడగటం దానికి రాజా రవీంద్ర జవాబు చెప్పి ఏదైతే అదే యింది. ఫిక్స్ చేయండి సర్ అనడం ప్రోమోలో వస్తుండటంతో రేపు ఈ ప్రోగ్రాం ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

జెమినీ టీవీ చానల్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం.

హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా, రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న విషయంపై షో నిర్వాహకులు ఇంకా పెదవి విప్పకపోవడంతో సస్పెన్స్‌గా మారింది.

 

Related posts

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు!

Drukpadam

పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా – అమెరికానుంచి పెద్ద కుమార్తె రావడం ఆలశ్యం

Drukpadam

ఆసుపత్రి నుంచి ఫామ్ కు సీఎం కేసీఆర్

Drukpadam

Leave a Comment