Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 18 న ఇందిరాపార్క్ వద్ద టీఆర్ యస్ ధర్నా …కేసీఆర్!

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 18 న ఇందిరాపార్క్ వద్ద టీఆర్ యస్ ధర్నా …కేసీఆర్!
-మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు , ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు
-కేంద్రం దిగి వచ్చే వరకు వదిలి పెట్టం
-కిరికిరి చేసే రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం దగ్గర అడగాలి
-బాయిల్డ్ రైస్ తీసుకోరు …రా రైస్ ఎంత తీసుకొంటావు చెప్పు
-సీఎం అడిగినా ఇంతవరకు జవాబు లేదు

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. హైదరాబాదు తెలంగాణ భవన్ లో  ఈ సాయంత్రం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 18 న హైద్రాబాద్ ఇందిరా పార్క్ లో టీఆర్ యస్ ఆధ్వరంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని ఆయన పండిపడ్డారు. ధాన్యం కొనే విషయం పక్కన పెట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఐకెపి కేంద్రాలను సందర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఐకెపి కేంద్రాల సందర్శన సందర్భంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేకపోతె రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. తమాషా చేస్తారా ? రైతులు పండించిన వడ్లను కొనమంటే రాజకీయాలా? కిరికిరి చేస్తారా ? తెలంగాణ రైతులు అమాయకులు అనుకుంటున్నారా ? తిరగబడితే వారిని ఆపడం ఎవరి తరం కాదు అని అన్నారు. శాంతి భద్రతా సమస్య వస్తుందని బీజేపీ అందాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వస్తే ఉరుకుంటామా ? ఎలా కంట్రోల్ చేయాలో తెలుసునని అన్నారు.

నేనే ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని వరి ధాన్యం కొనే విషయంలో అడిగి 50 రోజులు అవుతుంది. ఇంతవరకు కేంద్రం నుంచి సమాధానం లేదు .. ఒక ముఖ్యమంత్రి రైతాంగం విషయంలో అడిగితె దానికి జవాబు చెప్పకుండా ఉండటం ఏమిటి రైతులకన్నా పెద్ద విషయాలు ఏమి ఉంటాయి అని బీజేపీ చర్యలను తూర్పార బట్టారు. అసలు ధాన్యం కొంటారా ? లేదా? బాయిల్డ్ ధాన్యం కోనం అని చెప్పారు. రా రైస్ కొనాలి కదా ?ఎన్ని కొంటారో చెప్పాలి కదా ? అది లేదు . ఇదెక్కడి న్యాయం అని కేసీఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) ఏడాదికి తీసుకునే ధాన్యం వివరాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. తమ లేఖకు కేంద్రం జవాబు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని ప్రశ్నించబోతున్నారని, ఈ నెల 18న హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా కొనసాగుతుందని వివరించారు. ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడమే తమకు ముఖ్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

విలేకర్ల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు , పలువురు మంత్రులు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

 

Related posts

ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా!

Drukpadam

సంచలనం ….70 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం …?

Drukpadam

జగన్ బెయిల్ రద్దు … చంద్రబాబు జైలుకే…

Drukpadam

Leave a Comment