జిల్లాలో స్వతంత్ర, ఐక్య పోరాటాలు సారథిగా సిపిఎం
-ఆర్థిక, సామాజిక పోరాటాల, సేవా కార్యక్రమాల వారిది గా నిలిచిన సిపిఎం…
-భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా సిపిఎం 21వ జిల్లా మహాసభలు
-వినూత్న ప్రచారం ప్రారంభించిన జిల్లా కార్యదర్శి నున్నా
గత నాలుగేళ్లలో అనేక ఆర్థిక, సామాజిక పోరాటాలు, సేవా కార్యక్రమాల ద్వారా సిపిఎం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సందర్భానుసారంగా వామపక్ష, అఖిలపక్ష పోరాటాలు నిర్వహించి జిల్లా లో తన వంతు బాధ్యతను నిర్వహించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
స్థానిక బోసుబొమ్మ సెంటర్లో ఈనెల 29, 30 తేదీలలో మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్ లో జరుగు సిపిఎం పార్టీ 21వ జిల్లా మహాసభల ప్రచారాన్ని నున్నా నాగేశ్వరరావు ప్రారంభించారు. 21 సిపిఎం సింబల్స్ ను సెంటర్ లో ఏర్పాటు చేసి ఆవిష్కరించడం జరిగింది. త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో జిల్లాలో రైతాంగం, కార్మికులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థి, యువజనలు మొదలగు అనేక వర్గాల సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ పోరాటాలను, జాతీయ కార్మిక సమ్మేలను, రాష్ట్రంలో జరిగిన ఆర్టీసీ సమ్మె ను , పోడు భూముల పోరాటంలను అనేక రూపాలలో జిల్లాలో నిర్వహించి పోరాటాలకు అండగా సిపిఎం నిలబడిందన్నారు . జిల్లాలో పోరాటాలకు మద్దతుగా అన్ని పక్షాలను కలుపుకొని ఐక్య పోరాటాలు, స్వతంత్ర పోరాటాలను నిర్వహించమన్నారు. మరో ప్రక్క గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలోను, ప్రభుత్వ పరంగా చికిత్స పరమైన, సహాయక రూపాలలో ప్రజలకు అందాల్సిన సౌకర్యాలపై పోరాడుతూనే, మరో ప్రక్క జిల్లా వ్యాప్తంగా కోటి 20 లక్షల రూపాయల వివిధ వస్తు, ఆర్థిక, వైద్య పరమైన సహాయ సహకారాలను సిపిఎం పార్టీ చేపట్టిన ఈ జిల్లా ప్రజానీకానికి అండదండగా నిలిచింది అన్నారు. కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రావడానికి భయపడిన సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి 250 మందికి పైగా ప్రాణాలు కాపాడిన చరిత్ర సిపిఎం ది అన్నారు. అదే విధంగా అనేక మంది కోవిడ్ బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చిన వారికి, లాక్ డౌన్ల సందర్భంగా వేల మంది కి ఉచితంగా భోజనాలు సరఫరా చేసి అంద జేయడం జరిగిందన్నారు. అనేక మంది పెద్దల సహకారంతో నిరంతరాయంగా చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్, వైరా, ఖమ్మం రూరల్ మండలాల లో నెలనెలా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి నెల మూడు వేల మందికి పైగా బీపీ, షుగర్ బాధితులకు 100 రూపాయలకే వైద్యం, మందులు అందించడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా ఈ కాలంలో దేశ వ్యాప్తంగా వచ్చిన తుఫాన్ లు, వరదల సందర్భంగా, దేశంలో ప్రజలు ఇబ్బంది పడ్డ సందర్భాల్లో , అనేక సమ్మెలు పోరాటాలకు అండగా, సంఘీభావం గా నిలిచి పార్టీ ముందు ఉండి వస్తు, నగదు రూపంలో విరాళాలు సేకరించి అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో స్వతంత్ర, ఐక్య పోరాటాలు సారథిగా సిపిఎం వ్యవహరిస్తూ వచ్చిందన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కార్యక్రమాల సందర్భంగా ఈ నాలుగేళ్లలో అనేక అక్రమ కేసులు , నిర్బంధాలు సిపిఎం నాయకత్వంపై, కార్యకర్తలపై పెట్ట పడ్డాయి అన్నారు. అదేవిధంగా ఈ కాలంలో జరిగిన వివిధ రకాల ఎన్నికలలో అధికార, ధన ప్రలోభాలు ఎదుర్కొని పార్టీ ఐక్యంగా నిలిచి అన్ని రకాల పోరాటాలలో ముందు ఉందన్నారు. కావున జిల్లా ప్రజానీకం మహాసభల జయప్రధానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస రావు, తుశాకుల లింగయ్య, సీనియర్ నాయకులు బండారు యాకయ్య, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, నాయకులు పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, ఎస్.కె ఇమామ్, ఎస్ కె బాబు, అంకిత వెంకన్న, వేల్పుల నాగేశ్వర రావు, పఠాన్ మస్తాన్, రంగు హనుమంత చారి, సారంగి పాపారావు, ఆవుల శ్రీను, ఎర్ర నగేష్, నర్ర ఎంకన్న, రావుల శీను తదితరులు పాల్గొన్నారు.