Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

  • శాకాహారమే అని వెల్లడించిన అమెరికా పరిశోధకులు
  • మనకు మార్కెట్లో దొరికే గుడ్లు అన్ ఫర్టిలైజ్డ్ అన్న శాస్త్రవేత్తలు
  • వీటిలో మాంసాహారం ఉండదని వెల్లడి

కోడిగుడ్డు మాంసాహారమా? లేక శాకాహారమా? అనే విషయంపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. కొందరేమో ఇది శాకాహారమే అంటుంటారు. మరికొందరేమో ఇది కోడి నుంచి వచ్చింది కాబట్టి మాంసాహారమే అని వాదిస్తుంటారు. అయితే ఈ సందేహాలకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెక్ పెట్టారు. కోడిగుడ్డు శాకాహారమే అని వారు తెలిపారు. ఈ అంశంపై వారు నిర్వహించిన పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న గుడ్లు అన్ ఫర్టిలైజ్డ్ అని తెలిపారు. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని… ఎగ్ వైట్ లో మాత్రం ప్రొటీన్లు మాత్రమే ఉంటాయని చెప్పారు.

పచ్చ సొనలో అధిక సంఖ్యలో ప్రొటీన్లు, కొలెస్టరాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పుంజుతో కోడిపెట్ట కలవకపోయినా గుడ్లు పెట్టే విధానాన్ని అన్ ఫర్టిలైజ్డ్ అని అంటారు. ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే గుడ్లు ఈ రకానికి చెందినవే. దీంతో, వీటిని శాకాహారంగా తీసుకోవచ్చని చెప్పారు.

Related posts

బ్రిట‌న్ రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చార్లెస్‌- 3

Drukpadam

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పై క్యాట్ ఆగ్రహం!

Drukpadam

ఖమ్మం జైలుకు రాఘవ…రహస్యంగా తరలింపు

Drukpadam

Leave a Comment