ధాన్యం సేకరణలో తప్పెవరిది …మీదంటే మీదే బీజేపీ ,టీఆర్ యస్ , లేదు ఇద్దరిది …కాంగ్రెస్
ధాన్యం సేకరణలో తప్పంతా తెలంగాణ సర్కారుదే …కేంద్రమంత్రి పీయూష్ గోయల్
రైతుల ఆత్మహత్యలకు టీఆర్ యస్ దే భాద్యత :కేంద్రం
రైతుల ఆత్మహత్యలకు కేంద్ర వైఫల్యం కూడా కారణమేనన్న ఉత్తమ్
రాజకీయ దుమారం రేపుతున్న ధాన్యం సేకరణ
లోక్ సభలో ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన
తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందన్న పియూష్ గోయల్
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ కు చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై తప్పంతా టీఆర్ యస్ సర్కారుదే అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సర్కారుపై నిందలు వేసే ప్రయత్నం చేశారు. దీనికి ఉత్తమకుమార్ రెడ్డి స్పందిస్తూ కేంద్రానిది కూడా భాద్యతే అవుతుందని ధాన్యం సేకరణలో కేంద్రం చెప్పిన విధంగా కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో నేడు ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఆహార భద్రత, పోషకార లోపం అంశాలపై లోక్ సభలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్టోబరు నుంచి మార్కెట్ కు ధాన్యం వస్తోందని, అయితే అందులో సగం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) సేకరించలేదని వెల్లడించారు. ఎఫ్ సీఐ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ఏమైందని ఉత్తమ్ ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ బదులిచ్చారు. ధాన్యం సేకరణ అంశంలో తమ తప్పేమీలేదని, తెలంగాణ ప్రభుత్వమే జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కారు రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి కేంద్రానికి అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని, అనేక పర్యాయాలు కాలపరిమితిని పొడిగించినా ప్రయోజనం లేకపోయిందని పియూష్ గోయల్ వివరించారు.