Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేణుగుంట ఎయిర్ పోర్టులో హై డ్రామా చంద్రబాబు ధర్నా …

తిరుపతిలో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు

ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ప

తిరుపతిలో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు

ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు

అక్కడే బైఠాయించిన చంద్రబాబు

10 గంటల పాటు నిరసన

ఫలించిన అర్బన్ ఎస్పీ, జేసీ విజ్ఞప్తులు

తిరుపతిలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంతో అక్కడే ధర్నాకు కూర్చున్నారు.అత్యంత నాటకీయ పారీణామాల మధ్య పోలీసులకు ఆయనకు మధ్య అనేక దఫాల చర్చల అనంతరం ఆయన తన నిరసన విరమించుకుని హైద్రాబాద్ వెళ్లారు.  ధర్నాకు అనుమతించకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు హైదరాబాద్ పయనం అయ్యారు. ఈ మధ్యాహ్నం నుంచి ఆయనను హైదరాబాద్ తిప్పి పంపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మధ్యాహ్నం ఓసారి ఆయనను హైదరాబాదు పంపేందుకు పోలీసులు విమానంలో టికెట్లు కూడా బుక్ చేశారు. అయితే వీలుకాకపోవడంతో రాత్రికి మరోసారి టికెట్లు బుక్ చేశారు. ఈ పర్యాయం ఆయన రేణిగుంట ఎయిర్ పోర్టును వీడేందుకు అంగీకరించారు. దాంతో 10 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే సాగిన నిరసన ముగిసింది. ఈ క్రమంలో చంద్రబాబుతో తిరుపతి అర్బన్ ఎస్పీ, జేసీ పలుమార్లు చర్చించారు. చంద్రబాబు ఎయిర్ పోర్టులో నిరసన తెలుపున్నంత సేపు పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. లాంజ్ లో నేలపై కూర్చున్న చంద్రబాబు సీరియస్ గా ఫోన్ చూసుకుంటుండగా, చంద్రబాబునే చూస్తూ పోలీసు అధికారులు నిల్చుని ఉండడం పలు వీడియోల్లో దర్శనమిచ్చింది. మధ్యమధ్యలో వారు ఆయనను వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేయడం, ఆయన ససేమిరా  అనడం కూడా కనిపించింది 

Related posts

స్మిత సబర్వాల్ వంటి వ్యక్తికే భద్రతలేదు …కేసీఆర్ పాలనలో మోసం దగా …రేవంత్ రెడ్డి …

Drukpadam

కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్థాన్!

Drukpadam

ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment