Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్థాన్!

కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్థాన్!
-టికెట్ ధరలు తగ్గించాలని ఆదేశం
-ప్రస్తుతం కాబూల్-ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 2500 డాలర్లు
-ఆగస్టు ముందునాటి ధరలకు తగ్గించాలని తాలిబన్ల పట్టు
-లేకుంటే విమాన సర్వీసులు రద్దు చేస్తామని హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒకటేమిటి అనేక దేశాలనుంచి ఇక్కడకు విమానాలు రాకపోకలు సాగిస్తుండేవి. అక్కడ ఏర్పడిన పరిస్థితులు విమానాలు నడిపేందుకు వివిధ దేశాలు విమానాలు నడిపేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఒక పాకిస్తాన్ దేశం తప్ప ప్రపంచంలోని ఏదేశం కాబుల్ కు విమానాలు నడిపేందుకు ముందుకు రావడంలేదు. అయితే పాకిస్తాన్ కూడా తమదేశం నుంచి నడిపే విమానాలను రద్దు చేసుకుంది. కారణం విమాన టిక్కెట్ల ధరలను తాలిబన్లు నిర్ణయించడం .అవి పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ వారికీ గిట్టుబాటు కాకపోవడంతో తమ విమానాలు నడపడంలేదని పాకిస్తాన్ తెలిపింది . పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ నుంచి కాబుల్ కు 120 నుంచి 150 డాలర్లు ఉండగా ఇప్పుడు ఏకంగా 2500 పెంచారు. ఆఫ్ఘన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ లు రేట్లు పెంచడంతో దాని ప్రభావం ప్రయాణికుల మీద పడుతుందని పాక్ అంటుంది.

ఆఫ్ఘనిస్థాన్‌కు నడుస్తున్న ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. ఆ దేశానికి విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ప్రకటించింది. టికెట్ ధరలను తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించడమే అందుకు కారణం. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబూల్-ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లుగా ఉంది.

ఈ నేపథ్యంలో మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలని తాలిబన్లు ఆదేశించారు. టికెట్ ధరలను తగ్గించలేని పీఐఏ విమాన సర్వీసులను రద్దు చేసింది. తాము మానవతా దృక్పథంతోనే విమాన సర్వీసులు నడుపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, తమ సిబ్బందిని తాలిబన్లు భయపెడుతున్నారని పీఐఏ ఆరోపించింది.

Related posts

ఎన్నికల పనులు పూర్తీ చేయాలి …రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

Drukpadam

కేసీఆర్ రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

Drukpadam

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు విచారిస్తామన్న చీఫ్ జస్టిస్.. !

Ram Narayana

Leave a Comment