లాక్ డౌన్ దిశగా భారత్ …న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే…?
ఓమిక్రాన్ ప్రభావమే కారణం …దేశంలో పెరుగుతున్న కేసులు
ఆందోళన అవసరం లేదన్నతున్న వైద్యరంగా నిపుణులు
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని సూచన
అనవసర ప్రయాణాలు చేయద్దని విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా రెండు రోజులు లాక్ డౌన్ ? దేశం మొత్తం పాక్షిక లాక్ డౌన్
జనవరి ఫస్ట్ వచ్చేస్తోంది. ఎంచక్కా హేపీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవచ్చని ఉబలాటపడుతున్నారా ? ఈ ఏడాది అంత సీన్ లేదని హెచ్చరి స్తోంది. కోవిడ్ -19. కొత్త వేరియంట్లతో విజృంభించేందుకు సిద్ధమైన ఒమిక్రాన్ ఈసారి న్యూ ఇయర్ అంటూ,ఎవరూ బయట కు కూడా రాకుండా చుట్టేస్తోంది . కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం కూడా కొత్త నిబంధన అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.ఈ డిసెంబర్ 31 జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం.మొత్తం లాక్ డౌన్ ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు : చేపడుతోంది.నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గుంపులుగా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం వలన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కాబట్టి న్యూజయర్ నాడు.దానికి ముందు రోజు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తిరిగి జనవరి 03-01-2022 న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.. ఓమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అందువల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం ఇప్పటికి రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమైయ్యాయి. ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరిగితే ఫైన్ వేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు గుంపులుగా గుమిగూడే అవకాశం ఉన్నందున రెండు రోజులు లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది.