Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటక మంత్రి రాసలీలల వ్యవహారంలో కొత్త కోణం…

కర్ణాటక మంత్రి రాసలీలల వ్యవహారంలో కొత్త కోణం
-సీఎం యడుయూరప్ప అవినీతి పరుడంటూ సంభాషణ
– మాజీ సీఎం సిద్దరామయ్య నిజాయతి పరుడంటూ కితాబు
-కర్ణాటకలో సంచలనంగా మరీనా మంత్రి టేపుల వ్యవహారం
రాజీనామా చేసిన మంత్రి రమేష్ జర్కి హోలీ

కర్ణాటక జలవనరుల మంత్రి రమేశ్ జర్కిహోళి రాసలీలల వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పేరిట తనను లోబర్చుకున్నాడంటూ ఓ మహిళ రమేశ్ జర్కిహోళిపై ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగులు బయటికి రావడంతో రమేశ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ వీడియో క్లిప్పింగుల్లో రమేశ్ జర్కిహోళి సీఎం యడియూరప్పపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కన్నడనాట ప్రచారం జరుగుతోంది.
యడియూరప్పపై విమర్శలు చేయడమే కాకుండా, మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపించడం ఆ రాసలీలల వీడియోలో దర్శనమిచ్చినట్టు తెలిసింది. యడియూరప్ప చాలా అవినీతికి పాల్పడ్డాడని, సిద్ధరామయ్య మంచివాడని జర్కిహోళి సదరు మహిళతో అన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
కాగా, రాసలీలల వీడియో టేపులోని సంభాషణలు బహిర్గతం కావడంతో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఇది సెక్స్ కుంభకోణం మాత్రమే కాదని, సీఎం పెద్ద అవినీతిపరుడని మంత్రే స్వయంగా అంటున్నాడని ఆరోపించారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులోనే ఉందని, బీజేపీ సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నానని శివకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాజకీయాలలో సంచలనంగా మారింది.

Related posts

లోకసభ లో దుమారం …లకింపుర్ ఘటన పెద్ద కుట్ర: రాహుల్ ధ్వజం

Drukpadam

ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి స్పందన!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో ఫుల్‌స్టాప్..

Drukpadam

Leave a Comment