Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుమార్తె తలనరికి చంపినా కసాయి తండ్రి…

కుమార్తె తలనరికి చంపినా కసాయి తండ్రి
తల చేతిలో పట్టుకొని బజారుకొచ్చి తాను తప్పు చేయలేదని కేకలు
-యూ పి లో ఘటన
-నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
సొంత కూతురిని తల నరికి చంపినా కసాయి తండ్రి విషయం ఉత్తర ప్రదేశ్ రాష్టంలోని ఒక గ్రామంలో వెలుగు చూసింది.తన కూతురు తలనరికి దాన్ని తీసుకొని బజార్లో తిరుగుతున్నా వ్యక్తిపై గ్రామస్తులే పోలీసులకు ఫిర్యాదు చేయటం వారు అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే …
మహిళలపై నేరాల విషయంలో ముందు నిలిచే రాష్ట్రాల్లో ఉండే ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం, లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన ఓ తలను చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. ఆ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న ఇద్దరు అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గానికి ఎదురొచ్చి, అడ్డగించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీశారు. తొలుత అతని పేరు అడిగి, ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, హత్య చేసింది మాత్రం తానేనని చెప్పాడు. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. ఆపై పోలీసులు నరికిన తల కిందపెట్టి, కూర్చోవాలని సూచించగా, చెప్పినట్టుగానే చేశాడు. మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు. ఆపై అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, కేసును విచారిస్తున్నామని అన్నారు.

Related posts

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి!

Drukpadam

విదేశీ విద్యార్థులకు చెక్ పెట్టే యోచనలో బ్రిటన్ ప్రధాని!

Drukpadam

నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..

Drukpadam

Leave a Comment