Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతకీ షర్మిల ఎవరు వదిలిన బాణం…?

ఇంతకీ షర్మిల ఎవరు వదిలిన బాణం…?
-చంద్రబాబు వలలో షర్మిల చిక్కారా ?
-అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలు మోస్తున్నాయా ?
-ముందు ఆమెను తెలంగాణాలో రంగంలోకి దింపి తరువాత ఆంధ్రలోనా ?
– ముందుగానే పసిగట్టిన కొందరు పధకంలో భాగస్వాములా?
-బలమైన కారణం లేకుండా పార్టీ నిలబడుతుందా ?
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాల గమ్మత్తుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల, తెలంగాణాలో పార్టీ పెట్టటడం వెనక పెద్ద మతలబే ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.ఆమె ఎవరు వదిలిన బాణం ? ఎందుకు పార్టీ పెడుతున్నారు. చంద్రబాబు వలలో షర్మిల చిక్కారా ? అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలు మోస్తున్నాయా ?ముందు ఆమెను తెలంగాణాలో రంగంలోకి దింపి తరువాత ఆంధ్రలోనా ? పధకంలో భాగస్వాములే ప్రచారకర్తలా? బలమైన కారణం లేకుండా పార్టీ నిలబడుతుందా ? పార్టీ పెట్టాలనే ఆలోచన నిజంగా ఆమె వంట పుట్టిందా ఎవరైనా పుట్టించారా? అన్నకు ఆమె కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయా ? ఉంటె పార్టీ పెడితే పరిస్కారం అవుతాయా? పెట్టినా ఆంధ్రాలో పార్టీ పెట్టాలి లేదా ఏదైనా పార్టీ లో చేరి అన్న మీద క్షక్ష తీర్చుకోవాలి. అంతే కానీ ఆమె నిర్ణయం వెనక ఎదో మతలబు ఉందనే అభిప్రాయాలూ మాత్రం ఉన్నాయి. ఒక వేళ నిజంగా పార్టీ పెట్టినా, ఆంధ్ర ,తెలంగాణ అనేది లేకుండా ఉండాలి .కానీ ఆమె తెలంగాణే నే ఎందుకు ఎంచుకున్నారు. ఆంధ్రాలో ఎందుకు పెట్టటం లేదని అంటే అక్కడ అన్న పాలనా ఉంది కదా అంటున్నారు. పైగా అన్నకు, చెల్లెలు పార్టీ పెట్టడం ఇష్టం లేదు. అందునా ఆమె గతంలో అన్నకోసం రాజకీయాలలోకి వచ్చింది .స్వయంగా తాను రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆమెకు ప్రస్తుతం పేరున్న నాయకుల సపోర్ట్ లేదు.గతంలో ఉన్న నాయకులూ మద్దతు దారులు సైతం షర్మిల పెట్టబోయే పార్టీ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆమె పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అందుకోసం అనేక మందిని కలుస్తున్నారు . వారివద్దనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు . ఇప్పటి వరకు ఆమె పార్టీ విషయంలో స్పష్టత ఇవ్వకపోయినా పార్టీ పెట్టేందుకు వడివడిగా పావులు కదుపుతున్నారు. అన్న అండ లేదు. పెద్ద నాయకులూ ఎవరు లేరు. కాకపోతే వైయస్ చరిష్మా తోనే ముందుకు సాగుతున్నారు. గతంలో అనేక మంది ఆవేశంగా పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. వైయస్ అభిమాని గొనె ప్రకాష్ రావు అన్నట్లు ఆమె కాల్చుకుంటే కాల్చుకున్నది కానీ ఆమెను నమ్ముకున్నవాళ్లను కాల్చవద్దని . ఆయన మాటలతో ఏకీకబావించాల్సిన అవసరం ఉంది .ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచవద్దు అనేది మంచి మాటే . ఆమె పార్టీ పెట్టేందుకు బలమైన కారణాలు కనిపించటం లేదు. ఆమె పార్టీ పెట్టడం డిస్క్రైజు చేయటానికి కాదుకానీ పార్టీ పెట్టడానికి సమయం సందర్భం మాత్రం కాదు . కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు దానికి ఒక రీజన్ ఉంది . సమయం ,సందర్భం రెండు ఉన్నాయి. తెలంగాణ వాదం బలంగా ఉంది ఆంధ్రా పెత్తనం , నీళ్లు ,నిధులు ,నియామకాలు పై తెలంగాణ మొత్తం ఏక తాటిపై నడిచింది. అది వర్క్ అవుట్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చిరంజీవి ప్రజారాజ్యం మనకు ఉదాహరణ . ఆయన సినీ ఇండస్ట్రీ లో తిరుగులేని రారాజు . ప్రజల్లో క్రేజీ ఉన్న నంబర్ వన్ హీరో . అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి ఊరూరా తిరిగారు .జనం ఆయన మీటింగులకు పరుగులు పెట్టారు. కానీ తీరా బాలట్ బాక్సలు తెరిచి చూస్తే ఓట్లు రాలలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు. ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే ఒక్క దగ్గర కూడా గెలవలేక పోయారు. ప్రజలను సంఘటితం చేసే బలమైన కారణం ఒక్కటి కూడా కనిపించటం లేదు. అయినా పార్టీ పెడుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆమె రాజకీయ అరంగేట్రం చేయటం ఆలోచించాల్సిందే . చాలాకాలం తరువాత ఆమెకు తెలంగాణ మీద ప్రేమ పుట్టడం ఏమిటి ? తాను రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పటం ఏమిటి? తెలంగాణాలో ఆమె అవసరం ఉందా? అనేక రాజకీయ పార్టీలు ఉండగా ఆమె ఎందుకు వస్తున్నట్లు ? దీని వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉంది. అనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు కేసీఆర్ అంటే మరి కొందరు బీజేపీ అంటున్నారు. లేదు జగన్ ఆమెతో ఇక్కడ పార్టీ పెట్టించి కథ నడుపుతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అన్ని కోణాలనుంచి చూస్తే చంద్రబాబు వలలో చిక్కారా అనే అనుమానాలు కలుగు తున్నాయి. షర్మిల పార్టీ పెట్టేందుకు కొంతమంది వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు రాజకీయ వర్గాలలో బలంగా ఉంది. ఇందుకు కారణం లేక పోలేదు .షర్మిల పార్టీ పెడతారనే వార్త ను ఒక ప్రముఖ దినపత్రిక కవర్ చేసింది. అంతే కాదు ఏ రోజున ఆమె బయటకు వస్తారనే విషయాన్నీ కూడా ఆ పత్రిక ద్వారానే వార్త రావడం విశేషం . అందుకు ఆపత్రికను తప్పుపట్టాల్సిన పనిలేదు. వాచ్ డాగ్ లాగా పనిచేసే మీడియా తన పని తాను చేస్తుంది. కానీ అంతకు ముందు వైయస్ కు తరువాత ఆయన కుటుంబానికి బద్ద శత్రువులుగా వ్యవహరించిన కొన్ని మీడియా సంస్థలు కీలకంగా వ్యవహరించిడం కూడా అనుమానాలకు బలం చేకూర్చుతుంది. ఏనాడూ జగన్ వార్తలు గాని ,షర్మిల వార్తలుగాని రాయని ఆ పత్రిక ఛానల్ ఆమె వార్తలు ప్రముఖంగా ఇస్తున్నాయి. జగన్ వార్తలు ఇచ్చినా వ్యతిరేక వార్తలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాయని ఆరోపణలు ఉన్నాయి. మరో ప్రముఖ పత్రికతో పాటు, రెండు చానళ్ళు షర్మిల వార్తలు ప్రముఖంగానే ప్రచారం చేస్తున్నాయి. అందువల్ల అనుమానాలకు తావిస్తుంది. ఇంతకీ షర్మిల ఎవరు వదిలిన బాణం ? కేసీఆర్ వదిలారా? లేక బీజేపీ వదిలిందా? చంద్రబాబు వలలో చిక్కుకున్నారా ? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

Related posts

ఆజాద్ కొత్త పార్టీ పెడతారని ప్రచారం …ఏమి జరుగుతుందో చెప్పలేమన్న ఆజాద్!

Drukpadam

నాడు కమీషన్ల కోసం కక్కుర్తి పడిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు: బండి సంజయ్

Drukpadam

కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్చిందా…?

Drukpadam

Leave a Comment