రాజకీయ వార్తలు

తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం: డాక్టర్ చీమ శ్రీనివాస్!

తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం: డాక్టర్ చీమ శ్రీనివాస్!
-ఉద్యమకారులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి
-తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వెబ్సైట్ ఆవిష్కరణ.
-ఉద్యమకారులంతా ఒక్కతాటిమీదకు రావాలని పిలుపు
-ఉద్యమకారుల వివరాలు , ఉద్యమాలు వెబ్సైటు లో పొందపరిచాలి

ఖమ్మం నగరంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్బను ఆవిష్కరించారు . ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని , కనీసం ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదని , ఉద్యమ కారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటికైనా ఉద్యమకారులంతా కళ్లు తెరిసి ఒక తాటిమీదకొచ్చి , ఉద్యమకారుల హక్కుల సాధనకై ఏకైక లక్ష్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు . తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన ఉద్యమం వివరాలను , పోరాటాలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్ లో పొందుపరిచి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను ప్రారంభించామని ఉద్యమ కారులు ఎవరైనా సరే తమ వివరాలను Www. tuf.org. in ఈ వెబ్సైట్లో పొందుపర్చవచ్చని సూచించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు , రాష్ట్ర చైర్మన్ బత్తుల సోమయ్య , ఉమ్మడి నల్లగొండ చైర్మన్ అనంతుల మధు , భట్టు రాజేందర్ , పగడాల నరేందర్ , పాలకుర్తి కృష్ణ , లింగన్న బోయిన సతీష్ , రడo సురేష్ , గుంతేటి వీరభద్రం , మాదాసు శ్రీనివాస్ , బాసాతి హన్మంతరావు , అంగిడి భిక్షం , అఫ్జల్ , సోమరాజు , భద్రునాయక్ , చావా రమేష్ , దేవళ్ల నాగేశ్వరావు , యాదగిరి , తోట వెంకట నారాయణ , ఊళ్లోజు వెంకన్న , బెల్లంకొండ నాగేశ్వరరావు , గుండు రంజిత్ , బొందల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు .

Related posts

తండ్రి క్యాబినెట్ లో మంత్రి కాబోతున్న ఉదయనిధి …?

Drukpadam

తెలంగాణ వచ్చాకే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు!

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముందుగానే భారతీయులను తరలించాల్సింది: సీతారాం ఏచూరి!

Drukpadam