చంద్రబాబు ఓటమి భయం… అందుకే కుప్పం పర్యటన : మంత్రి పెద్దిరెడ్డి!
మూడు రోజుల కుప్పం పర్యటనను చేపట్టిన చంద్రబాబు
చంద్రబాబు గెలిచే అవకాశం లేదన్న పెద్దిరెడ్డి
నిరాశతో జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శ
ఏపీ లో ఎన్నికలకు ఇంకా చాల టైం ఉంది . కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన క్యాడర్ ను ఇప్పటినుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. అంతే కాకుండా తన సొంత నియోజకవర్గంగా కుప్పంలో పర్యటనలు చేపట్టారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుందని అందుకే కుప్పం పార్టీయేనా చేపట్టారని ధ్వజమెత్తారు .
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రామాల పర్యటనను చేపట్టడం తమ నైతిక విజయమని అన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యే అయిన చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గంలో పర్యటించని గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పారు.
సీఎం జగన్ ఆధ్వర్యంలో తామంతా గ్రామాల పర్యటనలు చేస్తున్నామని… ఇప్పుడు చంద్రబాబు కూడా ఓటమి భయంతో కుప్పం పర్యటన చేపట్టారని అన్నారు. అభద్రతా భావంతో మూడు రోజుల పర్యటన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇక గెలవరనే విషయం కుప్పం ప్రజలందరికీ తెలుసని… తాము కూడా చంద్రబాబుకు గెలిచే పరిస్థితి లేకుండా చేస్తామని అన్నారు. జగన్ కు మంచి పేరు రాకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరాశ, నిస్పృహలతోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని చేసిన ప్రజలు ఈసారి చంద్రబాబుకు కుప్పంలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు . ఈసారి గెలిచే వాళ్ళకే సీట్లు అంటున్న చంద్రబాబు ముందు కుప్పంలో వేరే అభ్యర్థిని పెట్టాల్సి ఉండనై పెద్దిరెడ్డి తదైనా శైలిలో అన్నారు . ఇటీవల జరిగిన జడ్పీటీసీ ,ఎంపీటీసీ ,మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అసెంబ్లీ ఎన్నికల్లో అదేరీతిలో ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.