Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్యలపై స్పందించిన హెచ్ ఆర్ సి

ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్యలపై స్పందించిన హెచ్ ఆర్ సి
-మమతా బినానికి నోటిస్
-ఈ నెల 31 న హెచ్ ఆర్ సి హాజరు కావాల్సిందే
-ఆంధ్రభూమి ఉద్యోగుల పిటిసిషన్ పై స్పందించిన హెచ్ ఆర్ సి
తెలుగు పత్రిక రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిచిన ఆంధ్రభూమి పత్రికను మూసి వేసి ఉద్యోగులను రోడ్ మీద పడి వేయటంతో ఉద్యోగుల బతుకులు ఇబ్బదుల్లో పడ్డాయి. కరోనా పేరుతో మూతపడ్డ పత్రిక తెరుచుకోలేదు సరికదా ఉద్యోగులకు రావాల్సిన వేతనాలను సైతం గత ఏడాది కాలంగా చెల్లించకపోవటంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రిటైరైన ఉద్యోగులకు సైతం రావలసిన బకాయిలను చెల్లించక పోవటంతో ఆంధ్రభూమికి చెందిన నల్గురు , దక్కన్ క్రానికల్ కు చెందిన నల్గురు ఉద్యోగులు మనోవేదనకు గురైమరణించారు. ఇది ముమ్మాటికీ మానవహక్కుల ఉల్లఘన కిందకి వస్తాయనే అభిప్రాయాలే ఉన్నాయి . దీనితో టి యూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ చొరవతో ఆంధ్రభూమి ఉద్యోగులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించారు.కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆంధ్రభూమి ఉద్యోగుల సమస్యలను విని వెంటనే స్పందించారు. ఆంధ్రభూమి ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన వేతనాలను,రిటైర్ ఉద్యోగులకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఐదుసంత్సరాలుగా పెండింగ్ లో పెట్టడంపై ఎందుకు హెచ్ ఆర్ సి తీవ్రంగా స్పందించింది.ఆసంస్థకు చెందిన యజమాని మమతా బినాని ఈ నెల 31 వ తేదీన హాజరు కావాలని నోటీసు జారీచేసింది. ఆంధ్రభూమి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు వెలిజాల చంద్రశేఖర్ ద్వారా హెచ్ ఆర్ సి ఫిర్యాదుని స్వీకరించింది . దీనిపై స్పందించిన హెచ్ ఆర్ సి కి అసోషియేషన్ కృతఙ్ఞతలు తెలిపింది.

పి ఎఫ్ బకాయిలపై రీజనల్ కమిషనర్ కు ఫిర్యాదు
ఆంధ్రభూమి ఉద్యోగుల నుంచి ఏళ్ల తరబడి కట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు వారి ఖాతాల్లో జమచేయకుండా ఉండటంపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ఈ మేరకు ఉద్యోగుల సంఘం చైర్మన్ వెలిజాల చంద్ర శేఖర్ ఆధ్వరంలో ప్రాంతీయ పీ ఎఫ్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆంధ్రభూమి ఉద్యోగులనుంచి రావాల్సిన బకాయిలు ఇప్పటివరకు 15 కోట్ల రూపాయలు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి నోటీసు లు జారీచేయగా కేసు ఎన్ సి ఎల్ టి లో ఉందని తప్పించుకుంటుందని కమిషనర్ ఉద్యోగ సంఘ నేతలకు వివరించారు. పి ఎఫ్ బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఆర్ పి బినాని పై ఉందన్నారు. సెక్షన్ 406 408 ల ప్రకారం ఆర్ పి పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసే అంశం పై న్యాయ నిపుణులను సంప్రదించినట్లు పి ఎఫ్ కమిషనర్ తెలిపారని ఉద్యోగుల సంఘ నేతలు తెలిపారు. తమ ఫిర్యాదుపై వెంటనే యాజమాన్యానికి నోటీసులు జారీచేయనున్నట్లు కమిషనర్ తెలిపారు .
ఆంధ్రభూమి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై టి యూ డబ్ల్యూ జే ఐ జే యూ ఆందోళన చేపట్టాయి . ఆంధ్రభూమి క్రానికల్ ఆఫీస్ ముందు ధర్నా చేశాయి. ఇందులో ఐ జే యూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి సైతం పాల్గొన్నారు. యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. అవసరమైతే కలకత్తా లోని యజమాని వద్దకు వెళ్లి ఉద్యోగుల తరుపున పోరాడతామని హెచ్చరించారు.

Related posts

చంద్రబాబుకు హెలికాప్టర్ ఆఫర్ చేశాం..ఆయన నిరాకరించారు: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ స్కాం ..డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్…!

Drukpadam

ప్రగతి భవన్ లా రాజ్ భవన్ కాదు …గవర్నర్ తమిళశై సంచలనం వ్యాఖ్యలు !

Drukpadam

Leave a Comment