Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీకి బానిస పార్టీ అన్నాడీఎంకే: ఒవైసీ ధ్వజం

మోదీకి బానిస పార్టీ అన్నాడీఎంకే: ఒవైసీ ధ్వజం
-అన్నాడీఎంకే ఎంతమాత్రం జయలలిత పార్టీ కాదు
-బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా దానితో తో పొత్తు పెట్టుకుంది
-సెక్యులరిజం అంటే ఏమిటో తెలుసా?
అసదుద్దీన్ ఒవైసి ఎంఐఎం నేత ఆయన ఎక్కడికి వెళ్లిన సంచలనమే . తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. అన్నా డీఎంకే పార్టీ మోడీకి బానిస పార్టీగా ఆయన అభివర్ణించడం సంచలనంగా మారింది . పదునైన మాటలతో ఆయన ముస్లిం లను ఆకట్టుకుంటారు. అందువల్ల ఆయన ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉంటాయని ఇటీవల కొన్నిసందర్భాలలో ఆయన ప్రవేశాన్ని రాష్ట్రాలు అంగీకరించటం లేదు. ఎంఐఎం కు ముస్లిం మతవాద పార్టీగా పేరుంది.దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో పోటీసైతం చేస్తున్నారు. బీజేపీ తో రహస్య ఒప్పందం ఒవైసీకి ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. అందుకే బీజేపీకి ఉపయోగ పడే విధంగా ప్రతిపక్షాల,బీజేపీ వ్యతిరేక ఓట్లు చిలేవిధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. అందువల్లనే ఆయన ఎన్నికల్లో ఆయారాష్ట్రాలలో పోటీచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి . ఇందులో భాగంగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాట టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేయటం విశేషం . ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం చెన్నైలో ఆయన మాట్లాడుతూ, అన్నాడీఎంకే పార్టీపై తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రధాని మోదీకి బానిస పార్టీగా అన్నాడీఎంకే మారిందని విమర్శించారు. ఆ పార్టీ ఇకపై ఎంతమాత్రం జయలలిత పార్టీ కాదని చెప్పారు. మతతత్వ పార్టీ అని తెలిసి కూడా బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుందని దుయ్యబట్టారు.
బాబ్రీ మసీదును ఎంఐఎం పార్టీ త్యాగం చేసిందని మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాకరే ప్రశంసించారని… దీనికి తామెంతో గర్విస్తున్నామని ఒవైసీ అన్నారు. బీజేపీకి బీటీమ్ అంటూ తనను, దినకరన్ ను డీఎంకే విమర్శిస్తోందని… సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకేకు తెలుసా? అని ప్రశ్నించారు. తమిళనాడులో మూడు నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. మూడు నియోజకవర్గాలలో ఆయన ప్రచారం సాగుతుంది.

Related posts

బండి సంజయ్ కు చుర‌క‌లంటించిన మంత్రి కేటీఆర్!

Drukpadam

బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

Ram Narayana

సిపిఎం ప్రజాచైతన్య యాత్రలకు ప్రజల నుంచి స్పందన ….

Drukpadam

Leave a Comment