Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా…

టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా
మమతా బెనర్జీపై ప్రశంసలు జల్లు
పోరాట యోధురాలు అని ప్రశంస
కాందహార్ విమానం హైజాక్ సందర్భంగా ఆమె సాహసోపేతం చేయబోయారు
కేంద్ర మాజీ మంత్రి బీజేపీ మాజీనేత యశ్వంత్ సిన్హా మమతా బెనర్జీ పార్టీ టీఎంసీలో చేరారు. బీజేపీ అటల్ బిహారి వాజ్పాయ్ అధికారంలో ఉండగా యశ్వంత్ సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రిగా ,పనిచేశారు. బీహార్ కు చెందిన యశ్వంత్ సిన్హా కు మంచి పేరుంది. ఆయన మమతా పార్టీలో చేరిన సందర్భంగా మమత సాహసం గురించి ఆయన వివరించారు. 1999లో ఖాట్మండూ నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్ కు తరలిస్తున్న సమయంలో… విమానంలో బందీలుగా ఉన్న భారతీయులను వదిలి పెట్టాలని, వారి బదులుగా తనను బందీగా తీసుకోవాలని మమత అన్నారని చెప్పారు. ఆమె సాహసామెత నిర్ణయం పై ఆశ్చర్యపడ్డామని అన్నారు .తొలి నుంచి కూడా ఆమె పోరాట యోధురాలేనని అన్నారు. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో మమతతో కలిసి తాను పని చేశానని చెప్పారు. విమానం హైజాక్ అయిన సమయంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందని… ఆ సమయంలో తాను బందీగా వెళ్లేందుకు మమత సిద్ధమయ్యారని తెలిపారు. ఆమె గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. 1999లో జరిగిన ఈ హైజాక్ ఘటన కలకలం రేపింది. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయకపోతే విమానంలోని ప్రయాణికులందరినీ చంపేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. దీంతో ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్, మసూద్ అజహర్ లను భారత ప్రభుత్వం విడుదల చేసిందాని ఆయన గుర్తు చేశారు.

Related posts

టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్…

Drukpadam

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ … కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి అవకాశం!

Drukpadam

కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ …రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

Drukpadam

Leave a Comment