Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్…

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్
-ఏ బి సి డీ లుగా వర్గీకరించడని సూచన
-వారించిన రాష్ట్ర డీసీఎంస్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్
-భయం ఏమిలేదని సమర్ధన
– నాలుక కరుచుకొని ఖర్చులకు ఇస్తామని మాటమార్పు
-అవాక్కయిన నాయకులూ
-నవ్వుకున్నా సభికులు
పట్టభద్రల ఎన్నికలలో టీఆర్ యస్ పార్టీ డబ్బులు పంచుతుందనేందుకు వైరా ఎమ్మెల్యే వ్యాఖ్యలే నిదర్శనంగా నిలిచాయి. ఆతరువాత ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాను ఖర్చులకు ఇస్తామని అన్నానని సమర్థుచుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగలిసిన డేమేజ్ జరిగిపోయింది. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పట్టభద్రల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఓటర్లకు డబ్బులు కూడా ఇస్తాం ,ఆఫ్ ద రికార్డు ఎవరన్నా ఉన్నారా ? నగానే పక్కనే ఉన్న రాష్ట్ర డీసీఎంస్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఆయన మాటలకూ బిత్తర పోయారు. వెంటనే వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే భయం ఏమిలేదు , కార్యకర్తలకు ఖర్చులకోసం ఇస్తాం అన్నారు. ఓటర్లను ఏ బి సి డి లు గా వర్గీకరించాలని అన్నారు. ఏ అంటే ఖచ్చితంగా ఓటు వేశారని ,బి అంటే కొంత అనుమానం అని , అంటూ తన మాటలను సమర్థించుకునే పని చేశారు . వేదికమీద ఉన్న బొర్రా రాజశేఖర్ తో పటు అందరు ఎమ్మెల్యే మాటలకూ అవాక్కు అయ్యారు . సమావేశానికి వచినవారందరు నవ్వుకున్నారు . అప్పటికే జరగలిసిన డేమేజ్ జరిగిపోయింది. నాలుక కరుచుకున్న ఫలితం ఏమిలేకుడా అంట రికార్డు అయింది . ఇక మీడియా పక్కన పెడితే సోషల్ మీడియా ఉందికదా సంఘటన విపరీతంగా వైరల్ అయింది . ఎమ్మెల్యేగారూ మాత్రం తాను అలా అనలేదని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Related posts

లకిం పూర్ ఖేరి ఘటనలో తనకేపాపం తెలియదు ….కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా!

Drukpadam

పెగాసస్ వివాదం.. మిస్టర్ మోదీ అంటూ నిప్పులు చెరిగిన ‘దీదీ’!

Drukpadam

నేను మౌనంగా ఉన్నన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడావు: బండి సంజయ్ పై సీఎం కేసీఆర్ ఫైర్!

Drukpadam

Leave a Comment