Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తాము అధికారంలోకి వస్తే …ఆయిల్ ధరలు తగ్గిస్తాం స్టాలిన్

ఆయిల్ ధరలు తగ్గిస్తాం స్టాలిన్
– పెట్రోల్ పై రూ 5 డీజిల్ పై రూ 4
-డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలచేసిన స్టాలిన్
-స్థానికులకు 75 శాతం ఉద్యోగులు
-ప్రవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్లు
-విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు ,డేటా కార్డులు
-మెటర్నిటీ సెలవులు 12 నెలలు
-హిందూ యాత్రికులకు 25 వేలు లక్షమందికి
-హిందూ దేవాలయాల పునరుద్దరణకు 1000 కోట్లు
-చర్చులకు ,మసీదులకు 200 కోట్లు
-తమ మేనిఫెస్టో లీకైందన్న పళనిస్వామి
తమిళనాట ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే ,అన్న డీఎంకే లు ఇందుకు పోటీపడుతున్నాయి. తొలుత డీఎంకే తన మ్యానిఫెస్టో ను విడుదల చేసింది . ఆపార్టీ అధ్యక్షుడు ఎం కే స్టాలిన్ డీఎంకే మేనిఫెస్టో విదలచేశారు. ఆయిల్ ధరలు మండుతున్న వేళ వాటిని తగ్గిస్తామని ప్రకటించారు . పెట్రోల్ పై రూ 5 డీజిల్ పై రూ 4 తగ్గిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.అంతే కాకుండా వంట గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు సబ్సిడీ అందిస్తామన్నారు . ప్రతి ఆడవపడుచుకు 1000 రూపాయలు ప్రతినెలా అందిస్తామని హామీనిచ్చారు.ఉద్యోగాలలో 75 శాతం స్థానికులకే ఇస్తామని ,ప్రభుత్వ ఉద్యోగాలలో సీనియర్ గ్రాడుయేట్లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.మహిళలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.కాలేజీ చదివే ప్రతి విద్యార్థికి ట్యాబులు అందజేస్తామని అన్నారు. చిన్న,సన్నకారు రైతులకు సబ్సిడీలు అందజేస్తామన్నారు.రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వత పరిస్కారం కోసం ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్టంలో ఉన్న హిందూ దేవాలయాల మరమ్మతులకు 1000 కోట్లు , చర్చులకు, మసీదులకు 200 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. డీఎంకే మ్యానిఫెస్టో విడుదలతో అధికారంలో ఉన్న అన్న డీఎంకే అలర్ట్ అయింది. డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టో తమ తయారు చేస్తున్నమ్యానిఫెస్టో లాగానే ఉందని మేము ఇంకా మ్యానిఫెస్టో తయారుచేసుతున్నామని ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అయితే తమ మ్యానిఫెస్టోలో ప్రతికుటుంబానికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు అందచేయనున్నట్లు తెలిపారు.అదే విధంగా కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు నెలకు 1500 రూపాయలు అందజేస్తామన్నారు. ఇంకా తమ ప్రణాళికలో ప్రజలకు అనేక ప్రయోజనాలు కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు. రెండు జాతీయ ప్రధాన పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ లు అన్నా డీఎంకే , డీఎంకే కూటమిలో ఉన్నాయి.లెఫ్ట్ పార్టీలు కూడా డీఎంకే కూటమిలో ఉండటంతో జాతీయ పార్టీలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు.అందువల్ల ద్రవిడ పార్టీలదే ప్రధాన పాత్రగా ఉంది. వారి మ్యానిఫెస్టో లపైనే ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు.ఇంకా కొన్ని పార్టీలు ఉన్న వారి మ్యానిఫెస్టోలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. చూద్దాం తమిళ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో !!!

Related posts

కేసీఆర్ సర్కార్ కో నిఖాలో…తెలంగాణ కో బచావో తుక్కుగూడ సభలో అమిత్ షా పిలుపు !

Drukpadam

నిమ్మగడ్డవి శ్రీరంగనీతులు … మంత్రి పేర్ని నాని

Drukpadam

ఏపీ లో కొత్త జిల్లాల పేర్లు , జిల్లా కేంద్రాలపై రగులుతున్న చిచ్చు!

Drukpadam

Leave a Comment