Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎల్ఐసీ ప్రైవేటీకరణ.. ప్రైవేట్ రంగంలో అడవులు..

ఎల్ఐసీ ప్రైవేటీకరణ.. ప్రైవేట్ రంగంలో అడవులు..

  • ఎలెక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
  • బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తికి 4 పైలట్ ప్రాజెక్టులు
  • ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తాం.
  • డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు.
  • వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్ లో మార్పులు చేస్తాం.
  • దమన్ గంగా – పీర్ పంజాల్, పర్ తాపీ – నర్మదా, గోదావరి – కృష్ణా, కృష్ణా – పెన్నా, పెన్నా – కావేరీ నదుల అనుసంధానానికి బడ్జెట్ లో ప్రోత్సాహం. దీని వల్ల లబ్ధి పొదే రాష్ట్రాల నుంచి అంగీకారం రాగానే నదుల అనుసంధానం ప్రయత్నాలను కేంద్రం ప్రారంభిస్తుంది.
  • కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తాం.
  • కరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్.
  • డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తాం.
  • విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం.
  • ప్రైవేట్ రంగంలో అడవుల పెంపకం కోసం పథకం.
  • ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.
  • బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు.
  • దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్ర సాయం.
  • పట్టణ ప్రణాళిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.

Related posts

ఎమ్మెల్యే సండ్ర ముందస్తు పుట్టిన రోజు వేడుకలు
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరు

Drukpadam

ఏజన్సీ ప్రాంత బి టి రోడ్ల అభివృద్ధి పై ఎస్టీ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం!

Drukpadam

వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు   పీఆర్సీ అమలు చేయాలి…

Drukpadam

Leave a Comment