Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు   పీఆర్సీ అమలు చేయాలి…

వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు   పీఆర్సీ అమలు చేయాలి
-ఖమ్మం లో సీఐటీయూ ఆధ్వరంలో ధర్నా
-ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి
-510 జి ఓ ను వర్తింప చేయాలి -వారికీ పీఆర్సీ ఇవ్వాలి
-గత పదిహేను ఇరవై సంత్సరాలుగా పని చేస్తున్న పర్మినెంట్ చేయకపోడం దారుణం

వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులకు
పిఆర్‌సి ప్రకారం వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయాలని,ఆశ్రమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న హెల్త్ కోఆర్డినేటర్ కూడా 510 జీవోను వర్తింపజేసి పీఆర్సి చేయాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించడం జరిగింది.*

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ అధ్యక్షులు ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పిఆర్ సిలో జీఓ 60 ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచిందనికానీ వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదన్నారు. వీరందరూ గత 15 నుండి 22 సం||లుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 17 నెలలుగా కరోనా మహమ్మారితో సహవాసం చేస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వేతనాలు పెంచి, రెగ్యులర్ చెయ్యాలని వారు కోరారు.

నేషనల్ హెల్త్ మిషన్లోని రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, స్టాఫ్ నర్సులు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, స్వీపర్స్, వాచ్ మెన్స్ ఇతర సిబ్బంది వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలలోని ఉద్యోగులు, ఆయుష్, యన్ టి ఈపి, టీసాక్స్, ఆర్ బిఎస్ కె, యన్ సిడి, ఆరోగ్యశ్రీ, బ్లడ్ బ్యాంక్స్, సిమాంక్, ఎస్ఆర్ సి, ఎస్ఎన్ సియు, డైక్ ఇతర అన్ని స్కీంలలోని ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేస్తున్నారని. ఈఓలు ప్రోగ్రాం అధికారులు, హెమోర్డ్ ఏఎన్ఎంలు, డ్రైవర్లు, కంటింజెన్సీ ఉద్యోగులు, నేచురోపతి, ఐపియంలోని ఉద్యోగులు ఇతర విభాగాలలోని ఉద్యోగులు అందరూ మెరిట్ ప్రతిపదికన రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోష్టర్ ప్రాతిపదికన నియామకమైన గత 15 నుండి 22 సం||లుగా పనిచేస్తూ ఏజ్ లిమిట్ దాటిపోయి ఉన్నారు. కావున వీరందరినీ యదావిధిగా రెగ్యులర్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

నేషనల్ హెల్త్ మిషన్లో 510 జీఓ ద్వారా వేతనాలు పెరగని కమ్యూనిటీ ఆర్గనైజర్స్, అకౌంటెంట్స్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, స్వీపర్స్, వాచ్ మెన్స్ ఇతరులకు ఉన్న వ్యత్యాసాన్ని సవరించి పిఆర్ సి వర్తింపజేయాలని, భారత అత్యున్నత న్యాయస్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కల్గిన పోస్టులలో శాశ్వత సిబ్బందిని నియమించాలని సమాన విద్యార్హతతో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు.. దీన్ని గౌరవించి యన్ హెచ్ఎం ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని ఎన్ హెచ్ఎం ఉద్యోగులు గతంలోని 8, 9, 10వ పిఆర్ సిల ప్రకారం ఆయా క్యాడర్ కనీస మూల వేతనం పొందియున్నారు. అదే ఆనవాయితీగా ఈ పిఆర్ సిలో ఆయా క్యాడర్ల కనీస మూల వేతనాన్ని బట్టి వేతనాలు పెంచి ఇవ్వాలని, ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్ ఎం. గోపాల్ , పి.రమ్య యూనియన్ నాయకులు కిరణ్, రంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related posts

జూనియర్ డాక్టర్లపై కేసీఆర్‌ ఆగ్రహం…

Drukpadam

సీఐడీ కేసులు అక్రమమో, సక్రమమో కోర్టులే తేలుస్తాయి: సునీల్ కుమార్

Drukpadam

Here Are 8 Editors-Approved IGK Hair Products You Need to Try

Drukpadam

Leave a Comment