Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజింగ్ నుంచి గంటలో న్యూయార్క్ కు…

బీజింగ్ నుంచి గంటలో న్యూయార్క్ కు… హైస్పీడ్ విమానాలు అభివృద్ధి చేస్తున్న చైనా

  • టెక్నాలజీలో చైనా కొత్త పుంతలు
  • గంటకు 2,600 మైళ్ల వేగంతో విమానాలు
  • రాకెట్ ఇంజిన్ ఆధారిత విమానాల పరీక్ష 
  • 2025 నాటికి పూర్తిస్థాయిలో విమానం సిద్ధం

గత రెండు దశాబ్దాల కాలంలో చైనాలో సాంకేతిక విప్లవం అద్భుతమనదగ్గ రీతిలో విలసిల్లింది. గతేడాది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్ హైస్పీడ్ రైళ్లను తయారుచేసి రికార్డు సృష్టించిన చైనా, ఇప్పుడు సూపర్ సోనిక్ స్పీడ్ తో దూసుకెళ్లే అత్యాధునిక విమానాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ ‘స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్’ హైస్పీడ్ విమానాలను రూపొందించింది. వీటిని టియాంగ్జింగ్-1, టియాంగ్జింగ్-2 అని పిలుస్తారు. ఇవి ప్రస్తుతమున్న జెట్ విమానాల కంటే 6 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ సూపర్ సోనిక్ విమానాల వేగం గంటకు 2,600 మైళ్లు! ఆ లెక్కన బీజింగ్ నుంచి అమెరికా నగరం న్యూయార్క్ కు గంటలో ప్రయాణించవచ్చు.

ఈ విమానాల్లో రాకెట్లలో వాడే ఇంజిన్లు వాడతారని తెలుస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించిన స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సంస్థ, 2024 నాటికి ఈ సూపర్ సోనిక్ విమానాలను పూర్తిస్థాయిలో పరీక్షించాలని భావిస్తోంది. ఇక సిబ్బందితో జరిపే పరీక్షలను 2025లో నిర్వహిస్తుందట.

Related posts

మిల్లెట్స్ తినే వారు ఈ తప్పులకు చోటు ఇవ్వొద్దు..!

Drukpadam

లేటు వయసులో 8వ బిడ్డకు తండ్రి కాబోతున్న బ్రిటన్ మాజీ ప్రధాని!

Drukpadam

ప్రచారం ముగుస్తున్న వేళ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ ఊరట

Drukpadam

Leave a Comment