- హాస్యనటుడు అలీ ఎంపీ కానున్నారా ?
మళ్ళీ కలుద్దామన్న జగన్ మాటల్లో అంతరార్థం అదేనా ?
అలీ కి రాజ్యసభ సీటుపై జోరుగా ప్రచారం
గతంలో రాజమండ్రి సీటు ఆశించిన అలీ
ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సమయంలోనూ నిరాశే
మరో మూడు నెలల్లో ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు
అందులో ఓ సీటును మైనారిటీలకు కేటాయించే యోచన
దానిని అలీకే ఇవ్వాలని జగన్ నిర్ణయం?
హాస్యనటుడు అలీ ని ఏపీ సీఎం జగన్ మళ్ళీ కలుద్దామని అన్నారు. అలీ గత ఎన్నికల్లో వైసీపీ లో చేరి ముమ్మరంగా ప్రచారం చేశారు . ఎన్నికల్లో పోటీచేయాలని భావించినప్పటికీ జగన్ వారించారు . ఎదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని అనుకున్నారు . కానీ రెండు సంవత్సరాలుగా వేచి చూశారు . నిన్న సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ కలవడానికి వచ్చిన బృందంలో అలీ కూడా ఉన్నారు .ఆ సందర్భంగా అలీ ని మళ్ళీ కలుద్దామని సీఎం జగన్ అనడం తో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదాని నుంచి అలీ ని పంపుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సారి ముస్లిం మైనార్టీ కోటా నుంచి అలీ కి రాజ్యసభ అవకాశం ఉంటుందని అంటున్నారు అందువల్ల నటుడు అలీ రాజ్యసభ సభ్యుడు కానున్నురని ప్రచారం జరుగుతుంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి
ప్రముఖ సినీ నటుడు అలీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నట్టు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల వివాదంపై నిన్న చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ, పోసాని, రాజమౌళి, కొరటాల శివ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. చర్చల అనంతరం వారం రోజుల తర్వాత తనను కలవాలని అలీకి జగన్ సూచించారు. దీంతో అలీని రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఇందులో ఒక సీటును మైనారిటీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సీటును అలీకి కేటాయించాలని జగన్ చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల సందర్భంగా అలీ రాజమండ్రి టికెట్‌ను ఆశించినప్పటికీ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేకపోయారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగానూ అలీ పేరు తెరపైకి వచ్చినప్పటికీ అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో జగన్ తనను కలవాలని అలీని కోరడం రాజ్యసభకు పంపేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై అలీ మాట్లాడుతూ.. సీఎం తనను వారం రోజుల తర్వాత కలవమన్నారని, ఆయన ఏమిస్తారో తనకు తెలియదని అన్నారు.