Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మత పిచ్చి ప్రభుత్వం వద్దు …ప్రగతి కామక ప్రభుత్వం కావాలి:యాదాద్రి సభలో కేసీఆర్!

మత పిచ్చి ప్రభుత్వం వద్దుప్రగతి కామక ప్రభుత్వం కావాలి: యాదాద్రి సభలో కేసీఆర్!
మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది
బెంగుళూర్ లో మత కలహాలు రేపుతున్నారు
ప్రజాసమస్యలను గాలికి వడిలో మత రాజకీయాలు చేస్తున్నారు
భువనగిరి జిల్లాలో కేసీఆర్ పర్యటన
రాయగిరి వద్ద బహిరంగ సభ
కేంద్రంపై ధ్వజమెత్తిన వైనం
సాగు చట్టాలతో రైతులను ఏడిపించారని ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కారుకు పిచ్చి ముదురుతోందని అన్నారు. పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చి ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యల పరిష్కరంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు . ఇదెక్కడి ప్రభుత్వం ఇదేమి పాలన మతాల కులాల మధ్య కొట్లాటలు పెట్టి ఓట్లు దండుకోవటమేనా ? ఇదేమి రాజకీయం అంటూ మోడీ విధానాలను కేసీఆర్ తనదైన శైలిలో దుయ్యబట్టారు .

నరేంద్ర మోడీ సిగ్గు పడాలి … ఎవరు అవునన్నా కాదని ఐ టి రంగంలో సిలికాన్ వ్యాలీ లాంటి బెంగుళూర్ ను మత పిచ్చి లేపి కాశ్మీర్ లా తయారు చేస్తున్నారు .దేశం పరువు పొతే ఎవరు పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు . నిరుద్యోగం పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోతున్నాయి. మోడీ గారి ఉజ్వలమైన గొప్పతనానికి ఇది నిదర్శనమా ? దేశంలో విద్యేషాలు ,కులం మతం జాతి బేధం లేకుండా ముందుకు పోవాలి ..అమెరికాలో 95 శాతం క్రిస్టియన్లు ఉన్న మత పిచ్చి లేదు . ప్రజలు మేల్కొనకపోతే దేశం నాశనం అవుతుంది . కరెంటు ఎక్కడ … నీ బ్యాడ్ పాలసీ తో చీకట్లు కమ్ముతున్నాయి. దేశంలో 65 వేల టి ఎం సి నీళ్లు అందుబాటులో ఉన్నాయి , 35 వేల మాత్రమే మనం వాడుతున్నాం. దేశంలో ఆకలి పెరుగుతుంది.ప్రపంచంలో మనం 101 స్థానంలో ఉన్నాం ..మనకన్నా బంగ్లా దేశ్ , పాకిస్తాన్ బెటర్ గా ఉన్నాయి. మీ గొప్ప పరిపాలనలో గంగా నదిలో శవాలు తేలుతున్నాయి. ఇది మన గొప్ప పాలన …కరోనా తో నీ తెలివి తక్కువవల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు . కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు

బీజేపీ వాళ్ళ మీద మాట్లాడితే వాళ్లకు లాగులు తడిశాయి.దీంతో పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు … కేసీఆర్ ఎంత సముద్రంలో నీటి చుక్క అంత అంటున్నారు ..అయితే ఆ నీటి చుక్కకు ఎందుకు భయపడాలి … మీటర్ పెట్ట కుంటే పెట్ట కుంటే కుదరదు అంటే చచ్చినా పెట్టం అని ముఖం మీద చెప్పాం. రైతు వ్యతిరేక చర్యలు తెలంగాణ ఒప్పుకోదు … బీజేపీ చరిత్ర దేశం అంత తెలిసింది.అన్ని భాషల్లో వీళ్ళ భాగోతం చెపుతాం …. ప్రగతి శీల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం … మత పిచ్చి ప్రభుత్వాన్ని పారదోలాలి అని పిలుపు నిచ్చారు .

అహంకారం మంచిది కాదు … మాట్లాడితే ధర్మం అంటారు . రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యమా ? అసోం సీఎం నీవ్వు ఏ అయ్యకు పుట్టావని రాహుల్ ను అడుగుతావా ? ఇదేనా నీ సంస్కృతీ , అసోం సీఎంను వెంటనే భర్తరఫ్ చేయాలనీ కేసీఆర్ డిమాండ్ చేశారు .

వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ఏడాదిపాటు రైతులను ఏడిపించారని పేర్కొన్నారు. ఢిల్లీ వద్ద అన్నదాతలను అవమానించారని, గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో రైతులపై కార్లను కూడా ఎక్కించారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఆ వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకున్నారని, ప్రధాని స్వయంగా క్షమాపణ కోరారని వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ను అడిగినా సాధ్యపడలేదు

సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రి ఓ జిల్లాగా ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదని, ఇవాళ కలెక్టరేట్ భవనం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే పలు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించామని తెలిపారు. ‘అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ ను కూడా అడిగాం. ఆయన కూడా మంచిర్యాలను జిల్లాగా చేస్తానని అన్నారు. ఎందుకో గానీ అది సాధ్యపడలేదు. అనేక అపోహలు అందుకు ప్రతికూలంగా మారాయి’ అని కేసీఆర్ వివరించారు.

 

Related posts

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట…

Drukpadam

రిటైర్ మెంట్ పై సోనియా గాంధీ పరోక్ష వ్యాఖ్యలు!

Drukpadam

వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు: షర్మిల వార్నింగ్…

Drukpadam

Leave a Comment