Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు.. మహిళ సాహసం!

మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు.. మహిళ సాహసం!

  • చత్తీస్‌గఢ్‌లో ఘటన
  • వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్, కార్మికుడి కిడ్నాప్
  • రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసున్న పిల్లలతో అడవిలోకి
  • మావోలు విడిచిపెట్టడంతో తిరిగి ఇంటికి

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ సాహసం చేసింది. ఐదేళ్లలోపు వయసున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను వెతుక్కుంటూ దండకారణ్యంలోకి బయలుదేరారు. ఈ క్రమంలో తన భర్తను మావోయిస్టులు విడిచిపెట్టారన్న సమాచారంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన.

ఇంద్రావతి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌లను ఈ నెల 11న మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలి.. తన ఇద్దరు పిల్లలను చూసైనా తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను వెతుక్కుంటూ బీజాపూర్, నారాయణ్‌పూర్ సరిహద్దులోని అబుజ్మద్ అడవిలోకి బయలుదేరారు. స్థానిక జర్నలిస్టుల సాయంతో మావోయిస్టులను కలవాలని నిర్ణయించుకుని అడవి బాట పట్టారు.

ఈ క్రమంలో తాము అపహరించిన ఇద్దరినీ మావోయిస్టులు విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న సోనాలి ఆనందంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అశోక్ పవార్‌కు స్వల్పంగా గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. మావోలు తమను ఇబ్బంది పెట్టలేదని, చెరో రూ. 2 వేలు ఇచ్చి పంపించారని అపహరణకు గురైన కార్మికుడు ఆనంద్ చెప్పారు.

Related posts

భాగ్యనగరంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జనం ….

Drukpadam

రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు… చంద్రబాబు!

Ram Narayana

అమరావతి రాజధానిపై కేసు జనవరి 28 కి వాయిదా…

Drukpadam

Leave a Comment