- ఎనిమిది మంది ఐఏఎస్ లకు స్థానచలనం
- పలువురికి అదనపు బాధ్యతల కేటాయింపు
- టీటీడీ ఈవోగానూ కొనసాగనున్న జవహర్ రెడ్డి
- కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు
ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.
ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ బదిలీ అయ్యారు.
రవాణా శాఖ కమిషనర్ గా ఎంటీ కృష్ణబాబు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు, క్రీడలు యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు.. పీఎస్ఆర్‌కు ఇంటెలిజెన్స్.. రాజేంద్రనాథ్ రెడ్డికి ఏసీబీ
- ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా భరత్
- ఐఏఎస్ బదిలీలతో పాటే ఐపీఎస్‌ల బదిలీలు
ఏపీలో ఐఏఎస్ అధికారులతో పాటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. ఇక ఏసీబీ డీజీగా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి భరత్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.