Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వారణాసిలో బూత్ కార్యకర్తలతో మోదీ మీటింగ్.. చాలా కుర్చీలు ఖాళీ!

వారణాసిలో బూత్ కార్యకర్తలతో మోదీ మీటింగ్.. చాలా కుర్చీలు ఖాళీ!

  • ‘బూత్ విజయ్ సమ్మేళన్’ కార్యక్రమం
  • 3361 బూత్‌ల నుంచి 20 వేల మందికిపైగా హాజరవుతారని అంచనా
  • ప్రసంగం ఆలస్యం కావడంతో ఒక్కొక్కరుగా జారుకున్న వైనం
  • వెళ్లిపోవడానికి ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పిన తీరు  

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న తన నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం వెలవెలబోయింది. ఇక్కడి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘బూత్ విజయ్ సమ్మేళన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3361 బూత్‌ల నుంచి దాదాపు 20 వేల మంది బీజేపీ బూత్ కార్యకర్తలు హాజరు కావాల్సి ఉంది. అయితే, మోదీ ప్రసంగం ఆలస్యం కావడంతో సమావేశం నుంచి ఒక్కొక్కరు జారుకున్నారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మోదీ ప్రసంగం అరగంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో చివరికి బీజేపీ ఓబీసీ ఫ్రంట్ అధ్యక్షుడు సోమనాథ్ మౌర్య కూడా సభ నుంచి నిష్క్రమించారు.

కార్యక్రమానికి హాజరైన వారందరూ వెనుదిరగడంతో వందలాది కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేదిక నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పడం గమనార్హం. బూత్ అధికారి సన్నీసింగ్ మాట్లాడుతూ.. అత్యవసర సమావేశానికి వెళ్లాల్సి ఉందని, మళ్లీ వస్తానని చెప్పారు.

కార్యకర్తలు వెనుదిరగడంపై సోమనాథ్ మౌర్య మాట్లాడుతూ.. మధ్యాహ్నం నుంచి ప్రజలు వేదిక వద్ద ఉన్నారని ఆకలి, దాహంతో అలమటించడంతో కొందరు, బహిర్భూమికి మరికొందరు వెళ్లారని అన్నారు. అలా వెళ్లినవారంతా తిరిగి వెనక్కి వస్తారని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మోనికా పాండే కూడా సభ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తన కుమార్తెకు పరీక్షలు ఉండడంతో ఆమెను దింపేందుకు వెళ్లానని, తిరిగి వస్తానని చెప్పారు. యూపీలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ సాక్షాత్తూ ప్రధాని మోదీ సమావేశం ఇలా వెలవెలబోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Related posts

అమలాపురం అగ్నికి జిల్లా పేరు మార్పు కారణమా ? .. కుట్ర కోణం ఉందా??

Drukpadam

జలదోపిడిపై కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేతల ముప్పేట దాడి…

Ram Narayana

Leave a Comment