ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్‌ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. వారం రోజుల్లో తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్‌ 2) లాంఛనంగా ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్‌, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది.

రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీస్‌ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభత్వుం పరిశీలిస్తోంది.

జిల్లాల ఎర్పాటు విషయంలో ఎవరికి ఏలాంటి అభ్యంతరాలు లేక పోయినప్పటికి పేర్ల విషయంలో జిల్లా కేంద్రాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై ప్రభుత్వం కసరత్తు జరుగుతుంది.

Related posts

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు… సీఎం జగన్…

Drukpadam

ఏముంది నా దగ్గర ఇవ్వడానికి?: కాంగ్రెస్ లో చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Ram Narayana

కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర!

Drukpadam