Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జానారెడ్డి ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు మలుపు కావాలి

జానారెడ్డి ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు మలుపు కావాలి

-హాలియా ఎన్నికల సభలో వక్తలు
-జనంలో పుట్టిన నాయకుడు జానారెడ్డి
-కాంగ్రెస్ బతకాలి -అవినీతి అంతం కావాలి
-కేసీఆర్ అహంకారానికి .కాంగ్రెస్ అభివృద్ధికి జరుగుతున్న ఎన్నిక
-రాష్ట్రం బ్రష్టు పట్టింది -చెప్పు ముఖ్యమంత్రి కి బుద్దిచెప్పాలి
-సర్పంచ్ లుగా గెలవలేని వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు
-డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు
-పాల్గొన్న ఉత్తమ్ , భట్టి, కోమటిరెడ్డి , జీవన్ రెడ్డి, పొన్నం ,వి హెచ్ ,షబ్బీర్ ,దామోదర్ రెడ్డి,కొండా సురేఖ
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ని గెలిపించటం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో మలుపు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపు నిచ్చారు. జానారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హాలియాలో జరిగిన సభలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేసీఆర్ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనంలో పుట్టున నాయకుడు జానారెడ్డి అయన గెలుపు ద్వారా కేసీఆర్ అహంకారాన్ని దించాలని అన్నారు. కాంగ్రెస్ ను బతికించటం ద్వారా అవినీతిని అంతమొందించాలని నాయకులు పిలుపునిచ్చారు. జానారెడ్డి తాను నియోజవర్గంలో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరించారు. సాగర్ డాం కట్టింది కాంగ్రెస్ , నియోజవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న నియోజకవర్గం రాష్ట్రాల్లో ఒక్క నాగార్జున సాగర్ మాత్రమే నన్నారు.
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయం మరింత వేడెక్కింది. డబ్బు మూటలను తీసుకువచ్చి ఇక్కడ వెదజల్లుతున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తగునా? కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , సీనియర్ నేతలు వి హెచ్, జీవన్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,షబ్బీర్ అలీ , వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొని అధికార టీఆర్ యస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జానారెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ సర్పంచ్ లుగా గెలవలేని వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణీ అవుతున్నారని విమర్శించారు. ఈ అనుభవ శూన్యులా అభివృద్ధి చేసేది? అంటూ మండిపడ్డారు. సాగర్ కు తానేం చేశానో అడిగే హక్కు ఇతర పార్టీలకు లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తాము నీళ్లు ఇవ్వలేదని అంటున్నారని, కేసీఆర్ వస్తే తాము చేసిన అభివృద్ధిని చూపిస్తామని జానా పేర్కొన్నారు. ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ వెలిగే ఇతర పార్టీ నేతల్లా కాకుండా, జానారెడ్డి అంటే ఓ పోరాట యోధుడని తనకు తానే కితాబిచ్చుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండల వ్యవస్థకు ఆద్యుడ్ని తానేనని పేర్కొన్నారు. మండలం ప్రాతిపదికగా ప్రజలకు ఉపాధి లభిస్తోందంటే అది తన ఆలోచన వల్లేనని వివరించారు. ఈ విషయం ఇప్పటివాళ్లకు తెలియదని, కేసీఆర్ కు కొద్దికొద్దిగా తెలిసినా బయటికి చెప్పడని అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో అజ్ఞాతంలో ఉన్నవారిని బయటికి రప్పించి శాంతి చర్చలకు బాటలు వేసిన యోధుడు ఎవరు… తానేనని ఉద్ఘాటించారు. కానీ సీఎం కేసీఆర్… జానారెడ్డి ఎవరు అంటాడా? నన్ను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టంలోని తనకు సాటి ఎవరు లేరని పేర్కొన్నారు. చైతన్యవంతులైన నియోజవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.

 

Related posts

సీఎం పదవి దగ్గరే జనసేన ,టీడీపీ పార్టీలకు చిక్కు …

Drukpadam

క్రమశిక్షణ తప్పుతున్న వైసీపీ …నేతలు తీరుతో ఇబ్బందులు!

Drukpadam

పొంగులేటి పోటీపై డైలమా …?అసెంబ్లీకా …పార్లమెంట్ కా.…?

Ram Narayana

Leave a Comment