ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ గంటకు పైగా భేటీ!
-వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చ
-మోదీతో ముగిసిన జగన్ భేటీ
-కొత్త జిల్లాల ఏర్పాటును వివరించిన జగన్
-తెలంగాణ బకాయిలపై కూడా జరిగిన చర్చ
-పెండింగ్ ప్రాజెక్టులు , మెడికల్ కాలేజీలు ఏర్పాటుపై చర్చ
-రాష్ట్రానికి సహాయంపై నివేదన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కాసేపటి క్రితం ముగిసింది. మంగళవారం మద్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్…ఢిల్లీ చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంలలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ లో వివిధ కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం .దీంతో ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు వివరించడంతోపాటు , రాష్ట్రానికి రావాల్సిన నిధులు , పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ముందుగానే ప్రధాని ఆపాయిట్మెంట్ కోరిన జగన్ ప్రధాని కార్యాలయం పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం ప్రధానితో భేటీ అయ్యారు . రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు , పరిపాలన వికేంద్రీకరణ , పోలవరం పురోగతి , దానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు , రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 మెడికల్ కాలేజీలు , రెవిన్యూ లోటు , పై కూడా ప్రధానితో చర్చించారు. తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు , ప్రత్యేక హోదా విషాలను కూడా ప్రధాని వద్ద ప్రస్తావించాయినట్లు సమాచారం .
ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను మోదీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోదీకి వివరించిన జగన్.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కూడా వివరించారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించిన జగన్.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును మరోమారు ప్రస్తావించిన జగన్.. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి కూడా మోదీకి వివరించినట్లు సమాచారం.