Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వార్ వన్ సైడేనా… ?

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వార్ వన్ సైడేనా ?
-మైజార్టీ కోసం వైసీపీ లెక్కలేస్తుందా ??
-రెండవ స్తానం కోసం టీడీపీ , బీజేపీ పోటీ పడుతున్నాయా ???
– కాంగ్రెస్ ,సిపిఎం పోటీ నామ మాత్రమేనా ????
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో వార్ వన్ సైడేనా ? వైసీపీ కి తిరుగులేదా? అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు . ఏప్రిల్ 17 న ఉప ఎన్నిక జరగనున్నది .2019 ఎన్నికల్లో వైసీపీ కి చెందిన బల్లి దుర్గాప్రసాద్ ఇక్కడ నుంచి భారీ మైజార్టీ తో ఎంపీగా గెలుపొందారు. ఆయనకు కోవిద్ వచ్చి కోలుకుంటున్న సందర్భంలో గుండెపోటు వచ్చి ఆకస్మిక మృతి చెందారు.దీనితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది . ఇక్కడ నుంచి వైసీపీ తో పాటు టీడీపీ , బీజేపీ ,కాంగ్రెస్ ,సిపిఎం పార్టీలు పోటీ పడుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరిశీలన,ఉపసంహరణలు అనంతరం ఎంతమంది మిగులుతారు అనేది తేలాల్సివుంది. ఇటీవలనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది . 7 అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో 3 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వడ్ ఉన్నాయి. మొత్తం 15 లక్షల ,74 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. గత లోకసభ ఎన్నికల్లో గెలిచిన వైకాపా అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ కు 2 లక్షల 28 వేల 376 ఓట్ల భారీ మైజార్టీ తో గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి కి రెండవ స్థానంలో నిలిచింది.కాంగ్రెస్ ,బీజేపీ , బి ఎస్ పి లు డిపాజిట్లు పొగొట్టుకున్నాయి . ఈ పార్టీలకు నోటా కన్నా తక్కవ ఓట్లు రావడం విశేషం .
ఈ పార్లమెంట్ నియోజవర్గం నెల్లూరు , చిత్తూరు జిల్లాల లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉంది. ఇందులో నెల్లూరు జిల్లా లోని సర్వేపల్లి , గూడూరు , సూళ్లూరుపేట , వేంకటగిరి , చిత్తూరు , జిల్లాలోని తిరుపతి , శ్రీకాళహస్తి , సత్యవేడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ వైసీపీ గెలుపును ఎవరు ఆపలేరని ఆపార్టీ భావన . అందువల్ల గెలుపు కాదు మైజార్టీ ఎంత అనేది తమ ముందున్న లక్ష్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడులక్షల మైజార్టీ వస్తుందని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి అనిల్ 5 లక్షల మైజార్టీ వస్తుందని అంటున్నారు. అంటే ఆ పార్టీ 3 లక్షల నుంచి 5 లక్షల మైజార్టీ ఆశిస్తుంది . ఇప్పటికే నియోజకవర్గానికి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కి భాద్యతలు అప్పగించారు. టీడీపీ ,బీజేపీ లు రెండవ స్తానం కోసం పోటీ పడుతున్నాయని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వేరు ,చట్ట సభలకు జరిగే ఎన్నికలలు వేరనే అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ అంటుంది . అందువల్ల తమకే అనుకూలంగా ప్రజాతీర్పు ఉంటుందని భావిస్తుంది . జగన్ పరిపాలన రాక్షస పాలనలాగా ఉందని,రాష్ట్రంలో అభివృద్ధి లేదని , పాలన పడకేసిందని విసుగు చెందిన ప్రజలు తమకు ఓట్లు వేస్తారని, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని టీడీపీ చెబుతుంది . ఎవరి వాదనలు వారికి ఉన్నాయి . ఒక సీటు గెలిచినంత మాత్రాన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని పెద్దగా వచ్చే మార్పులు ఏమి లేవు. వైసీపీకి ఫలితం ప్రతికూలంగా వచ్చినా లేక తక్కువ మైజార్టీ తో గెలిచినా జగన్ పాలన పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ ,బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని పార్టీలు ఈ ఎన్నికను కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ కి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతు ఉంది. బీజేపీ సహకారంతో జనసేన పోటీచేయాలని భావించినా బీజేపీ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చి పోటీలోకి దిగింది. వైకాపా నుంచి ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ ఎం గురుమూర్తి పోటీచేస్తుండగా , టీడీపీ నుంచి పనబాక లక్ష్మి , బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ,కర్ణాటక మాజీ సి ఎస్ రత్నప్రభ , కాంగ్రెస్ నుంచి చింత మోహన్ పోటీలో ఉన్నారు. వైకాపా అభ్యర్థి రాజకీయాలకు కొత్తవారు . జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు వైద్య సహాయకుడిగా వ్యవహరించారు. అదే ఆయన్ను ఎంపీగా పోటీకి నిలిపింది . పేద కుటంబం నుంచి వచ్చారు. పనబాక లక్ష్మి , చింత మోహన్ పాత కాపులే , ఇరువురు కేంద్ర మంత్రులుగా పనిచేసినవారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం . సిపిఎం పార్టీ కూడా పోటీలో ఉంది . కాంగ్రెస్ ,సిపిఎం పోటీ నామ మాత్రమేనా అనే చర్చ కూడా ఉంది . తిరుపతి కి 15 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కవ సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది . 1952 లో మొదటి సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనంతసేయ్యం అయ్యంగార్ గెలుపొందారు. 2014 ,2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
————————————————————————————–
2019 ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
————————————————————————————–
బల్లి దుర్గాప్రసాద్ వైసీపీ 7 , 22 ,877
——————————————————
పనబాక లక్ష్మి టీడీపీ 4 ,94 ,501
——————————————————
నోటా కు 25 ,781
——————————————————–
చింతా మోహన్ కాంగ్రెస్ 24039
——————————————————-
డి .శ్రీహరిరావు బి ఎస్ పి 20971
——————————————————-
బి . శ్రీహరిరావు బీజేపీ 16125
——————————————————–
వైకాపా మెజార్టీ 2 ,28 , 376
———————————————————-

Related posts

హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

Drukpadam

‘స‌లాం తాలిబ‌న్స్’ అంటూ పాక్ లో బాలిక‌లతో బ‌ల‌వంతంగా గీతం పాడించిన వైనం..

Drukpadam

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… ఒక మావోయిస్టు మృతి

Drukpadam

Leave a Comment