Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు… మాజీ ఎంపీ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు!

ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు… మాజీ ఎంపీ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు!
-అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న పొంగులేటి
-ప్ర‌జ‌ల్లో తిరిగే వాడే నాయ‌కుండంటూ కామెంట్
-ప‌ద‌వులు ముఖ్యం కాదంటూ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌
-బతికినంత కాలం పదవి ఉండదని వ్యాఖ్య
-అంబేద్క‌ర్ అన్ని వ‌ర్గాల‌కు ఆద‌ర్శమ‌న్న మాజీ ఎంపీ

పదవులు శాశ్వతం కాదు వస్తుంటాయి పోతుంటాయి.అవి శాశ్వతం కాదు … ప్రజలు ….ప్రజల ప్రేమాభిమానాలు ముఖ్యమని టీఆర్ యస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఖమ్మం లో అంబెడ్కర్ విగ్రవ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్న మాటలు చర్చనీయాంశం అయ్యాయి. నీవు బతికినంత కాలం పదవి నీతో ఉండదు … మంత్రులు , ముఖ్యమంత్రులు , ప్రధానులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కాలగర్భంలో కలిసి పోయేవాళ్లే కానీ ఉన్నన్నాళ్లు వారు చేసిన మంచిపనులు శాశ్వతంగా గుర్తుంటాయని పేర్కొన్నారు . ఆయన చేసిన వ్యాఖ్యలు టీఆర్ యస్ పార్టీ గురించే అని ఉంటారని కొందరు, లేదు సహజంగానే ప్రజల్లో తిరిగే ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మాట్లాడి ఉంటారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు .

2014 ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ తరుపున ఖమ్మం లోకసభకు పోటీచేసిన పొంగులేటి అనంతరం టీఆర్ యస్ లో చేరారు . 2019 ఎన్నికల్లో ఆయనకు టీఆర్ యస్ ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తుందని భావించినప్పటికీ ఇవ్వకుండా నిరాకరించింది. అయినప్పటికీ ఆయన టీఆర్ యస్ లో కొనసాగుతున్నారు . పార్టీ మారతారని చాలాసార్లు ప్రచారం జరిగినప్పటికీ తాను టీఆర్ యస్ వీడాలని ఇప్పటివరకు అనుకోలేదని ఆయన అనేక సార్లు చెప్పారు . ప్రజల్లో కూడా ఆయనకు పార్టీ లో అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఖ‌మ్మంలో బుధ‌వారం జ‌రిగిన అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణలో పాలుపంచుకున్న పొంగులేటి, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉండాల్సిన ల‌క్షణాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి నోట నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. టీఆర్ఎస్‌లో ఓ వ‌ర్గం గురించే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.

“ప‌ద‌వులు ముఖ్యం కాదు. ప్ర‌జ‌ల‌ ప్రేమాభిమానాలు ఉండాలి. అవి లేక‌పోతే రాజ‌కీయ నాయ‌కులు కాల‌గ‌ర్భంలోకి వెళ్లిన‌ట్టే. మ‌నం లేక‌పోయినా ప్ర‌జ‌లు మ‌న‌ల్ని గుర్తు పెట్టుకోవాలి. ప్ర‌జ‌ల్లో తిరిగేవాడే నాయ‌కుడు. నాయ‌కుడు జ‌నంలో ఉండాలి. జ‌నం ఆ నేత‌ను గుర్తు పెట్టుకోవాలి. అంబేద్క‌ర్ అన్ని వ‌ర్గాల‌కు ఆద‌ర్శం” అంటూ పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Related posts

కేరళ సీఎం విజయన్ సిపిఎం అగ్రనేతలు ఏచూరి ,కారత్ లు సీఎం కేసీఆర్ తో భేటీ !

Drukpadam

అధికారపార్టీ చెప్పుచేతుల్లో పోలీసులు …బీజేపీ నేత విజయశాంతి ధ్వజం!

Drukpadam

ప్రాంతీయ భాషలను అణగదొక్కుతున్నారన్న కుమారస్వామి …అది మీ నాన్న హయాంలో కూడా జరిటిందన్న బీజేపీ !

Drukpadam

Leave a Comment