Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమలకి పోటెత్తిన భక్తులు ఒక్కరోజులోనే 88 వేలమంది!

తిరుమలకి పోటెత్తిన భక్తులు ఒక్కరోజులోనే 88 వేలమంది!
అధికారుల ఉక్కిరి బిక్కిరి …ఉరుకులు పరుగులు
తిరుమలలోనే మకాం వేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
కోవిడ్ తరవాత రికార్డు స్థాయిలో తిరుమలకి తరలివస్తున్న భక్తులు
ఒక్క‌రోజే 88,748 మంది!…
కోవిడ్ త‌ర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
స‌ర్వ ద‌ర్శ‌నం ద్వారా 46,400 మందికి స్వామి వారి ద‌ర్శ‌నం
నేటి నుంచి మూడు రోజుల పాటు వసంతోత్స‌వాలు
మూడు రోజుల పాటు ఆర్జిత సేవ‌ల ర‌ద్దు

క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని బుధ‌వారం రికార్డు స్థాయిలో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. బుధ‌వారం ఒక్క రోజే ఏకంగా 88,748 మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.  కోవిడ్ త‌ర్వాత ఇంత పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామి వారిని దర్శించడం ఇదే తొలిసారి. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని 46,400 మంది భక్తులు దర్శించుకోవ‌డం గ‌మ‌నార్హం. తిరుమల కొండలన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. భక్తుల రద్దీతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . ఏర్పాట్ల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. భక్తులు రద్దీ పెరగటంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలోనే మకాం వేశారు .

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపుల ద్వారా 16,529 మంది భక్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. మొత్తంగా బుధ‌వారం నాడు స్వామి వారిని 88,748 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

ఇదిలా ఉంటే.. గురువారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యత నిస్తుంది. భక్తులకు గదులు దొరకటం ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై అధికారులు చైర్మన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు .

Related posts

ఇక మీరు మారిన చంద్రబాబును చూస్తారు: ఎంపీలతో భేటీలో చంద్రబాబు

Ram Narayana

గర్భస్థ శిశువుకూ హక్కులుంటాయి: హైకోర్టు..

Drukpadam

సునంద పుష్క‌ర్ మృతి కేసులో శ‌శిథ‌రూర్‌ కు ఊర‌ట‌.. అభియోగాల కొట్టివేత‌!

Drukpadam

Leave a Comment