Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పుట్టినరోజు సందర్భంగా యాదాద్రీశ్వరుడికి కిలో బంగారం అందించిన మంత్రి అజయ్!

పుట్టినరోజు సందర్భంగా యాదాద్రీశ్వరుడికి కిలో బంగారం అందించిన మంత్రి అజయ్!
-ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి అజయ్
-మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు
-యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన
-కేటీఆర్ , ఎంపీ సంతోష్ , పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు , ఎంపీలు ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు
-ఖమ్మం లో గ్రాండ్ సెలబ్రెసెన్షన్స్

మంత్రి పువ్వాడ అజయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి కిలో బంగారం అందజేశారు. తొలుత ఖమ్మం లో తల్లి దండ్రుల ఆశ్విర్ వాదాలు తీసుకున్నారు .అనంతరం ఖమ్మం లో లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన పూజలు చేశారు . పలువురు ప్రజాప్రతినిధులు , అధికారులు , ఇతర ప్రముఖులు అజయ్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడనుంచి పెద్ద కాన్వాయితో యాదాద్రి చేరుకొని స్వామివారికి బంగారం అందించారు. ఆలయ అధికారులు మంత్రి అజయ్ కి ఘనస్వాగతం పలికారు .

యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నేడు(19.04.2022)తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంకు యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఈఓకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వగతం పలికారు.

యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారు సూచనల మేరకు నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట) నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం యదాద్రి నరసింహుడి కి మంత్రి పువ్వాడ దంపతులు స్వామి వారికి ఆయా కిలో బంగారంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం మంత్రి దంపతులను ఆలయ ఆధికరులు, అర్చకులు శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.

కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్ ను కలిసిన పువ్వాడ ….

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కి ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి కిలో బంగారాన్ని అందజేసిన మంత్రి పువ్వాడని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. మంత్రి అజయ్ తో పాటు వారి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు నయన్ రాజ్ ఉన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కు కేటీఆర్ ఫోన్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి మంత్రి అజయ్ కి శుభాకాంక్షలు చెప్పారు.

పరిపూర్ణమైన ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను మంత్రి అజయ్ చేరుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నందు తన నివాసంలో సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి గారు, తనయుడు డా. పువ్వాడ నయన్ లతో కలసి మొక్కలు నాటిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ముందు చూపుతో హరితహరం కార్యక్రమం ద్వారా ముందు తరాలకు ప్రాణ వాయువును వారసత్వంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు.

దాని కొనసాగింపుగా ఎంపి సంతోష్ గారు కేసీఅర్ గారి ఆశయ సాధన ను పూర్తి స్థాయిలో అమలు జరపడం పట్ల వారికి అభినందనలు తెలిపారు.

ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

మమతా కాలేజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన పువ్వాడ నాగేశ్వర్ రావు …

సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు మమతా హాస్పటల్ లో జరిగిన అజయ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

Related posts

ఎవరీ అదృష్టశాలి …అమెరికాలోరూ.3,197 కోట్లు గెలిచినా… ఇంతవరకు ముందుకు రాని విజేత!

Drukpadam

ఆ నిర్ణయం తప్పే కానీ… ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న సుప్రీంకోర్టు

Drukpadam

How To Update Your Skincare Routine For Autumn

Drukpadam

Leave a Comment