నందిగ్రామ్ పైనే అందరి ద్రుష్టి…
మమతా …సువెందు అధికారి మధ్యనువ్వా ?నేనా ?
-గెలుపు మాదంటే మాదే అంటున్న ఇరు పార్టీలు
బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ముగిసిన రెండో దశ పోలింగ్
బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్
అసోంలో 74.79 శాతం పోలింగ్
బెంగాల్ లో 30 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్
అసోంలో 39 స్థానాలకు ఎన్నికలు
-రెండవ దశలోనూ భారీ పోలింగ్
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు నిర్వహించిన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఇక్కడ ఈ సారి పోటీలో నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీ బీజేపీ నుంచి సువేడు అధికారి ఉండటంతో దేశం దృష్టిని ఈ ఎన్నిక ఆకర్షించింది . ఇక్కడ ఓటింగ్ సరళి పై కేంద్రం సైతం ఆరా తీసింది. హోరా హోరీగా జరిగిన పోలింగులో గెలుపు మాదంటే మాదే నని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ మీడియా సైతం ఎక్కడ ప్రత్యేక నిఘా పెట్టింది. సువెందు అధికారి వాహనం పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఇక్కడ ఎన్నికల సంఘ అదనపు బలగాలను మోహరించింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5.30 గంటల వరకు పశ్చిమ బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79 శాతం ఓటింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 69 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ చేపట్టారు.
కాగా, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నియోజకవర్గం కూడా ఈ రెండో విడతలోనే పోలింగ్ జరుపుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి కారణంగా జాతీయ మీడియా మొత్తం నందిగ్రామ్ పైనే దృష్టి పెట్టింది. నందిగ్రామ్ లో విజయం తమదంటే తమదేనని అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగాల్ లో బీజేపీ అనుకూలంగా వ్యవహరించాలని కేంద్ర బలగాలను హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీచేశారని మమతా ఆరోపించారు. నందిగ్రామ్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 7 దగ్గర అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందటంతో అక్కడకు చేరుకున్న మమతా గంటన్నర పాటు అక్కడే ఉండటం విశేషం .