Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నీలం సాహ్నీ

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నీలం సాహ్నీ
– ఈ నెల 8న పోలింగ్ … 10 లెక్కింపు
– బాధ్యతలు స్వీకరించిన రోజే ఎస్ఈసీ కీలక నిర్ణయం
-అవసరమైన చోట 9న రీపోలింగ్
-ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.82 కోట్ల మంది
ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రీ పోలింగ్ చేపట్టాల్సి వస్తే ఈ నెల 9న నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండబోవని ఎన్నికల సంఘం పేర్కొంది.

కాగా, పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ఆశించిన విపక్షాలకు ఈ నిర్ణయం నిరాశ కలిగించేదే! ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ్నించే తిరిగి ప్రారంభించాలని నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయించారు. ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు జరుపనున్నారు.

గతేడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటిలో 126 ఏకగ్రీవాలు కాగా, మిగిలిన 526 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పలు అంశాల కారణంగా 354 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,322 స్థానాలకు ఈ నెల 8న పోలింగ్ చేపడతారు.

పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2.82 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఈ ఎన్నికలను భవిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నిర్ణయించింది. మిగతా పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ ఎన్నికల్లో కూడా అధికార వైసీపీ క్లిన్ స్వీప్ చేస్తుందన్న ఉద్దేశంతోనే టీడీపీ భవిష్కరణ నిర్మాణం తీసుకుందని వైకాపా ఆరోపిస్తుంది. ఇప్పటికే గతంలో నోటిఫికేషన్ సందర్భంగా ఏకగ్రీవాలు వైకాపాకు అనుకూలంగా ఉండటంతో టీడీపీ ఇక ఎన్నికల్లో పాల్గొని లాభంలేదని ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Related posts

ప్రజలు తెలివైన వారు.. అంతిమంగా పని చేసే వాళ్లకే మద్ద‌తిస్తారు!: మంత్రి హ‌రీశ్ రావు!!

Drukpadam

ప్రొఫెస‌ర్ సాయిబాబాకు షాక్‌… బాంబే హైకోర్టు తీర్పును ర‌ద్దు చేసిన సుప్రీంకోర్టు

Drukpadam

తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు… ఆశ్చర్యపోయిన అధికారులు!

Drukpadam

Leave a Comment