తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. రాహుల్ గాంధీ ఓయూ అనుమతిని హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది. విసి స్టాండింగ్ కౌన్సిల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
కాగా, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంకమ్, పరీక్షలు నడుస్తున్న విషయాన్ని విసీ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాహుల్ యూనివర్సిటీలో పర్యటిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని విసీ స్టాండింగ్ కౌన్సిల్ తెలిపింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటనపై తాము ఆదేశాలు జారీ చేయలేదని, ఓయూ వీసీకే నిర్ణయాధికారమని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది
దీంతో కాంగ్రెస్ నాయకులు బుధవారం మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరినా వీసీ అనుమతి ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ, నిర్ణయాన్ని ఓయూ వీసీకి వదిలేసింది. పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఓయూ వీసీ ప్రస్తుతం లీవ్‌లో ఉన్నారు. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 6,7న రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది.