Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీలంక ఒక్కటే కాదు… అనేక దేశాలు ఆర్థికంగా కుదేల్!

శ్రీలంక ఒక్కటే కాదు… అనేక దేశాలు ఆర్థికంగా కుదేల్!

  • దారుణంగా దెబ్బతీసిన కరోనా
  • ఆపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
  • పెరిగిపోతున్న వాణిజ్య లోటు
  • తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు
  • మోయలేనంతగా అప్పుల భారం

మోయలేనంత అప్పుల భారం, ఆహారం, ఇంధనం వంటి నిత్యావసరాలకు తీవ్ర కొరత, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్న హింస, అదుపు తప్పిన ప్రజాపాలన… ఇదీ శ్రీలంక ప్రస్తుత పరిస్థితి. కరోనా వ్యాప్తి సృష్టించిన సంక్షోభం కొంతయితే, పాలకుల అసమర్థత మరికొంత… వెరసి శ్రీలంకను దారుణ పరిస్థితుల్లోకి నెట్టివేశాయి. అయితే, ఇటువంటి సంక్షుభిత పరిస్థితి ఒక్క శ్రీలంకలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో తాండవిస్తోంది.

అర్జెంటీనా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, పెరు, ఘనా, ఇథియోపియా, నేపాల్ వంటి దేశాలు సైతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అప్పుల అగ్నిపర్వతం, వేగంగా తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, అంతకంతకు అధికమవుతున్న వాణిజ్య లోటు ఈ దేశాలను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బ నుంచి కోలుకునేలోపు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడింది.

నేపాల్ విషయాన్నే తీసుకుంటే…  ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్య లోటు అంబరాన్నంటుతోంది. జులై 16న నేపాల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. తొలి 8 నెలల్లో ఆ దేశ వాణిజ్య లోటును పరిశీలిస్తే 9.5 బిలియన్ డాలర్లను తాకింది. నేపాల్ దేశ వార్షిక బడ్జెట్ కు సమానమైన మొత్తం అది. దానికితోడు చెల్లింపులు తగ్గిపోవడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించడం నేపాల్ వంటి చిన్నదేశాన్ని కోలుకోనివ్వడంలేదు.

పాకిస్థాన్ పరిస్థితి కూడా అందుకు భిన్నం కాదు. తమను రుణభారం నుంచి గట్టెక్కించే భారీ ఆర్థిక ప్యాకేజీ కోసం పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఐఎంఎఫ్ నిధులు ఇవ్వడంలో ఏమాత్రం జాప్యం చేసినా పాక్ ఆర్థిక పరిస్థితి కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయమని డాన్ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాకుండా, సౌదీ అరేబియా, చైనాలతో ఆర్ధికసాయం కోసం పాక్ జరిపే రాయబారాలపైనా దాని ప్రభావం పడుతుందని వెల్లడించింది. ఒకవిధమైన అస్థిరత రాజ్యమేలుతోందని డాన్ అభిప్రాయపడింది.

Related posts

ఘోరం ఘోరాతి ఘోరం …స్వంత కూతురిని లైంగిక చర్యకు భాగస్వామిని ప్రేరేపించిన మహిళ!

Drukpadam

బిగ్ బాస్ రియాలిటీ షో ? ఎక్కడో లెక్క తప్పుతుంది…

Drukpadam

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది పర్యాటకుల మృతి..

Drukpadam

Leave a Comment