Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఐజేయూ కు అనుబంధంగా మహారాష్ట్ర లో సంఘం … మొదటి మహాసభ దృశ్యాలు…

ఐజేయూ కు అనుబంధంగా మహారాష్ట్ర లో సంఘంమొదటి మహాసభ దృశ్యాలు
మహారాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు
హాజరైన ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిసెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్ము,
ఐజేయూ సెక్రటరీ వై నరేందర్ రెడ్డి , ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు మజీద్ . విరహత్

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ [IJU ]లో ,మరో ముఖ్యమైన రాష్ట్ర మైన మహారాష్ట్రలో సంఘం ఏర్పాటు కీలక పరిణామంగా మారింది. అదికూడా దేశ ఆర్థిక రాజధానిగా పిలవబడుతున్న ముంబై కేంద్రంగా ఏర్పాటు కావడం శుభపరిణామం. మహారాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రధమ మహాసభ ఆదివారం ముంబైలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.

ఇటీవలనే మహారాష్ట్ర జర్నలిస్ట్ లతో వచ్చిన సంబంధాలు యూనియన్ ఏర్పాటు కు దారితీసింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి కె విరావత్ అలీ కీలకంగా వ్యవహరించారు . అక్కడకు పలుమార్లు వెళ్లి వారికీ గైడ్ చేసి మహాసభలు ఏర్పాటు చేయడంలో అక్కడ జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించారు . దీంతో వారు మహారాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా ఏర్పడి రిజిస్టర్ చేయించుకున్నారు . దాన్ని ఐజేయూ కి అనుబంధంగా చేశారు . మహారాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ను ఐజేయూ కు అనుబంధంగా అంగీకరిస్తూ ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు . సభల ఏర్పాటు కోసం జి .శ్రీనివాస్ , ప్రమోద్ ఖతార్ ల కృషి చెప్పుకోదగ్గది . వారి పట్టుదలతో సభ ను అత్యంత జయప్రదంగా నిర్వహించారు .

ఆదివారం ముంబై లో జరిగిన ప్రధమ మహాసభ కు ఐజేయూ అధ్యక్షుడు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్ము , మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ మధుకర్ ..ఎం .కొండారెడ్డి తెలుగు కళాసమితి నావి ముంబై , ఐజేయూ సెక్రటరీ వై .నరేందర్ రెడ్డి , మజీద్ , విరహత్ అలీ తదితరులు హాజరైయ్యారు .

Related posts

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు…మంత్రి పొంగులేటి

Ram Narayana

నిత్యజీవితంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే విష పదార్థాలు ఇవే!

Drukpadam

మంగ్లీ బోనాల పాటపై వివాదం …. కేసు నమోదు…..

Drukpadam

Leave a Comment