Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో తెలంగాణ‌కు ముంపు ఉంది … ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ ర‌జ‌త్ కుమార్!

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో తెలంగాణ‌కు ముంపు ఉంది … ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ ర‌జ‌త్ కుమార్!
-పోల‌వ‌రంతో తెలంగాణ‌లో ల‌క్ష ఎక‌రాలు మున‌క‌కు గురవుతాయి
-భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల‌లు కూడా ముగిపోతాయ‌న్న తెలంగాణ ఐఏఎస్‌
-ఇంతవరకు కేంద్రం నుంచి స్పంద‌న రాలేద‌ని వివరణ

పోలవరం ఆనకట్ట ఎత్తుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు , ఆంధ్రప్రదేశ్ మంత్రులు ,తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజిత్ కుమార్ మీడియా ముందుకు వచ్చి పోలవరం వల్ల తెలంగాణలో లక్ష ఎకరాలు నీటమునుగుతాయని పేర్కొన్నారు . ఈ విషయాన్నీ కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదనిఅన్నారు . ఎప్పటికైనా పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలోని భద్రాచలం తో సహా అనేక నదీపరివాహక ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన ఉన్నదని అన్నారు .

ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా తెలంగాణ‌లో ఏకంగా ల‌క్ష ఎకరాల మేర పొలాలు మున‌కకు గుర‌వుతాయ‌ని తెలంగాణ నీటిపారుద‌ల శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ల‌క్ష‌ల ఎకరాల్లో పంట‌ల‌తో పాటు భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల నీటిలో మునిగిపోతాయ‌ని ఆ శాఖ తెలిపింది. ఈ మేర‌కు బుధ‌వారం తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు జ‌రిగే న‌ష్టంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ కార‌ణంగానే ఈ న‌ష్టాలు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని ర‌జ‌త్ కుమార్ తెలిపారు. పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ వ‌ల్ల క‌లిగే న‌ష్టంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి చాలాసార్లు నివేదించామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఈ అధ్య‌య‌నంపై ఇప్ప‌టిదాకా కేంద్రం నుంచి స్పంద‌న రాలేద‌ని కూడా ర‌జ‌త్ కుమార్ చెప్పారు. పోల‌వ‌రం వ‌ల్లే భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని తెలంగాణ‌కు చెందిన మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో ర‌జ‌త్ కుమార్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Related posts

భారత్ తో బంధం ముఖ్యమే.. కానీ మా సార్వభౌమత్వం మాకు మరింత ముఖ్యం: కెనడా రక్షణ శాఖ మంత్రి

Ram Narayana

కుతుబ్ మినార్ వద్ద మరో వివాదానికి తెరలేపుతున్న మతోన్మాదులు!

Drukpadam

ఏపీ ప్రభుత్వానికి ఊరట.. ‘సిట్’పై స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment