Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తమ టార్గెట్ కేసీఆర్ …ఎంపీలు ఎమ్మెల్యేలతో తమకు పంచాయతీ లేదు …ఈటల

టీత్వరలో టీఆర్ యస్ నుంచి బీజేపీ లోకి భారీగా చేరికలు : ఈటల

ఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు.. ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయి

  • తమ పోరాటం కేసీఆర్ తోనేననీ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదన్న ఈటల 
  • ఇప్పుడు మంచి రోజులు లేవని, అందుకే పార్టీలోకి ఎవరినీ తీసుకోలేదని వివరణ 
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రాజేందర్ 
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ జోరు పెంచుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆకర్షించేందుకు ఒక టీమ్ ను కూడా బీజేపీ అధిష్ఠానం ఏర్పాటు చేసిందంటే… పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Many TRS leaders are in touch with me says Etela Rajender
తాజాగా బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు మంచి రోజులు లేవని, అందుకే పార్టీలోకి ఎవరినీ తీసుకోలేదని చెప్పారు. ఈ నెల 27 తర్వాత చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు.

తమ టార్గెట్ సీఎం కేసీఆరే…మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తమకు పంచాయతీ లేదు …కేసీఆర్ అహంకారవైఖరిపై అనేకమందికి ఉన్న అభిప్రాయాలూ బయటకు చెప్పలేక పోతున్నారు . సమయం వచ్చినప్పుడు తప్పకుండ చెపుతారు. అనేకమంది టీఆర్ యస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారు . వారు ఎన్నికల ముందు వరకు టీఆర్ యస్ లు ఉంటారు . తరవాత పెద్ద ఎత్తున బయటికి వస్తారు అని మాజీమంత్రి బీజేపీ నేత ఈటల అభిప్రాయపడుతున్నారు

టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ పోరాటం కేవలం కేసీఆర్ తో మాత్రమేనని… టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదని అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అందరికంటే ముందు తాను ఎదిరించానని… ఇప్పుడు తన బాటలో నడిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందు వల్ల… ఇప్పుడే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే కారణం వల్ల వారు బహిర్గతం కాలేకపోతున్నారని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని… ప్రతి ఒక్కరూ తనతో టచ్ లో ఉన్నారని ఈటల చెప్పారు. కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప, కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి… ఆయనను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇతరపార్టీలనుంచి తమపార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే గట్టి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి జిల్లాల వారీగా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు అనే వివరాలు సేకరించింది. అలాంటి వారి పరిస్థితి ఏమిటి అనే విషయాలను ఆరాతీస్తోంది. వారిని బీజేపీలో చేరేందుకు ప్రోత్సహిస్తూ రాబోయే బీజేపీ ప్రభుత్వమేనని వారికి భరోసా ఇస్తుంది. అంతేకాకుండా కొంతమందికి మంత్రులు చేస్తామని కూడా ప్రవేట్ సంభాషణల్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనేది వారి ఉద్దేశం . తమ టార్గెట్ కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీల పై కాదు అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొనడం గమనార్హం. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా కొంత మంది తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. వారు బీజేపీలో చేరతారా? లేదా ? అనేది ప్రశ్నార్థకమే?… అయితే రానున్న రోజుల్లో వారికి మరిన్ని ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా బిజెపి వైపు ఆకర్షించాలని వారి ప్లాన్ . అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాల్సిందే …

Related posts

జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ఆర్ ఫొటో ఉంది.. కేసీఆర్ ఫొటో ఎందుకు లేదని అడిగా: మంత్రి సింగిరెడ్డి…

Drukpadam

గంట సేపు కోదండ‌రాం మౌన‌దీక్ష…..

Drukpadam

నాడు రోశయ్య అసెంబ్లీకి ఉరితాడు తెచ్చుకుంటే వద్దని వారించాం: సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment