Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు!

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు!
-పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో శిక్ష
-గీతతో పాటు ఆమె భర్తకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష
-వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధించింది. బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ మేరకు శిక్షను విధించింది.

ఈ కేసుకు సంబంధించి 2015లోనే సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వీరిని అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. కాసేపట్లో బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

ఆమె మొదట వైసీపీలో చేరి అరకు ఎంపీ గా ఎన్నికైయ్యారు. అనంతరం ఆమె వైసీపీకి దూరంగా ఉన్నారు . అయితే బీజేపీ కి దగ్గరైన గీత తరవాత కాలంలో టీడీపీకి దగ్గర అయ్యేందుకు కూడా ప్రయత్నించారు . తిరిగి ఇటీవలనే బీజేపీ లో చేరిన గీత పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేశారనే అభియోగాలతో కోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఆమె మోసం చేశారనే అభియోగాలు నిర్దారణ కావడంతో కోర్ట్ ఆమెకు ఐbదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఆమె తో పాటు భర్త కూడా కేసులో జైలుకు వెళ్లనున్నారు .అయితే జైలుకు వెళ్లకుండా బైలు కోసం వారు కోర్ట్ లో అప్పీల్ చేసుకున్నారు .

Related posts

పెళ్లి పందిరిలో ఊడిపోయిన వ‌రుడి విగ్గు.. పెళ్లి ర‌ద్దు చేసిన వ‌ధువు!

Drukpadam

కొడుకు మృతి …కోడలికి రెండవ పెళ్లి …!

Drukpadam

ఉపాధ్యాయులను బోధ‌నేత‌ర ప‌నుల‌కు వాడద్దు: ఏపీ సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు!

Drukpadam

Leave a Comment